పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ఓజి నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద మాములు సంచలనాలు నమోదు చేయడం లేదు. రెండో వారంలోకి అడుగు పెట్టక ముందే 5 మిలియన్ క్లబ్బులోకి చేరుకోవడం చాలా పెద్ద మైల్ స్టోన్. అయితే ఇది ఆషామాషీగా జరగలేదు. పక్కా ప్రణాళికతో, ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వాటిని తట్టుకుని నిలవడం వల్లే మేజిక్ నెంబర్ సాధ్యమయ్యింది. మొదటగా చెప్పుకోవాల్సింది నెల రోజుల ముందే మొదలెట్టిన అడ్వాన్స్ బుకింగ్. అభిమానుల్లో ఉన్న హైప్ ని గుర్తించి దానికి అనుగుణంగా డిస్ట్రిబ్యూటర్ సరైన ప్లానింగ్ తో థియేటర్లను లాక్ చేయడం వల్ల టికెట్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.
యుఎస్ వసూళ్లలో కీలకంగా వ్యవహరించే ఎన్ఆర్ఐస్ లో ఓజి మీద ఉన్న విపరీతమైన ఆసక్తిని పసిగట్టి ఎప్పటికప్పుడు స్క్రీన్లను పెంచుకుంటూ పోవడం చాలా మేలు చేసింది. కెనడా లాంటి చోట్ల స్థానిక బయ్యర్లతో వచ్చిన పేచీ వల్ల షోలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చినా భయపడకుండా సమస్యను సర్దుబాటు చేసిన విధానం ఎంతైనా మెచ్చుకోదగినది. ఇక చెప్పుకోవాల్సిన అసలు ముచ్చట మరొకటి ఉంది. కంటెంట్ డెలివరీలో చివరి నిముషం ఒత్తిడి, టైంకి సెకండాఫ్ సిద్ధం కాకపోవడం లాంటివి అందరి మీద తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఫిజికల్ డ్రైవ్స్ రవాణా అతి పెద్ద ఛాలెంజ్ గా నిలిచింది.
ఇక్కడ పవన్ కళ్యాణ్ విదేశీ అభిమానులు చూపిన చొరవ, కొరియర్లుగా మారేందుకు సైతం వెనుకాడని తత్వం వెరసి చాలా థియేటర్లకు డ్రైవ్స్ ని చివరి నిమిషంలో అందేలా చేశాయి. ఇది జరుగుతుందనే నమ్మకంతోనే నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ షోలు రద్దు కాకుండా తనవంతుగా ఏం చేయాలో అంతా చేయడం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. నిర్మాత, ఫ్యాన్స్ ని నమ్మకుండా లేనిపోని ప్రెజర్ తెచ్చుకుని షోలు వదులుకోవడం లాంటివి చేయలేదు. దీని వల్ల చెప్పిన టైంకే ప్రీమియర్లు పడ్డాయి. ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఈ ప్లానింగ్ లో ఏ మాత్రం తేడా కొట్టినా నెంబర్లలో అల్లకల్లోలం జరిగేది. ఏదైతేనేం కథ సుఖాంతమయ్యింది.
This post was last modified on September 29, 2025 11:49 am
తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…
గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…