టాలీవుడ్ నే కాదు ప్రతి బాషా పరిశ్రమను వేధిస్తున్న పైరసీని కట్టడి చేయడానికి ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా పరిష్కారాలు దక్కిన దాఖలాలు చాలా తక్కువ. తాజాగా సినిమా పైరసీని చేస్తూ వేల కోట్ల నష్టాన్ని కలగజేస్తున్న ఆరుగురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం శుభవార్తగా చెప్పొచ్చు. మొన్న జూలైలో కిరణ్ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళ ముఠా తాలూకు మూలాలు దుబాయ్, మయన్మార్, నెదర్లాండ్ తదితర దేశాల్లో ఉన్నట్టు గుర్తించి వాటిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. తాజాగా ఆరుగురితో కూడిన గ్యాంగ్ సభ్యులు దొరికారు.
తెలుగు, హిందీ, తమిళం బాషా ఏదైనా సరే మొదటి రోజే పైరసీ చేసేందుకు ఒక ప్రత్యేక మెకానిజంని ఏర్పాటు చేసుకున్న పైరసీ గ్యాంగ్ పలు నగరాల్లో తమ మెంబర్స్ ని ఏర్పాటు చేసుకుంది. మల్టీప్లెక్సుల్లో, ఎంపిక చేసిన సింగల్ స్క్రీన్లు ఎంచుకుని రహస్యంగా కెమెరా ఫోన్లతో షూట్ చేయడం, ఏజెంట్లతో కుమ్మక్కై ప్రింట్లు బయటికి తేవడం, శాటిలైట్స్ ని సైతం డీ కోడ్ చేసే స్థాయికి వెళ్లడం ఇవన్నీ ఈ ముఠా చేసే అరాచకాలు. తాజాగా ఓజిని సైతం వీళ్ళు వదల్లేదు. దీన్ని బట్టే ఎంత నెట్ వర్క్ సృష్టించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారితో విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు బయటికి రాబోతున్నాయి.
గత ఏడాదిగా విపరీతంగా పెచ్చుమీరిన పైరసీ వల్ల సుమారు 22 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఒక అంచనా. గేమ్ చేంజర్ మొదటి రోజే హెచ్డి ప్రింట్ బయటికి రావడం అందరిని నివ్వెరపోయేలా చేసింది. ఇప్పుడీ అరెస్టు వల్ల కలిగే ప్రయోజనం కేవలం మనకు మాత్రమే కాదు. బాలీవుడ్, కోలీవుడ్ తదితర పరిశ్రమలు ఊరట చెందుతాయి. కాకపోతే విదేశాల్లో ఉంటూ అక్కడి సర్వర్ల ద్వారా పైరసీని విశ్వవ్యాప్తం చేస్తున్న అసలు దొంగలను పట్టుకునే మార్గాలు అన్వేషించాలి. అప్పుడే దీనికి అడ్డు కట్ట పడుతుంది. అప్పుడెప్పుడో సూర్య సినిమా వీడోక్కడేలో చూపించినట్టు పైరసీ విశ్వరూపం అనుకున్న దానికన్నా చాలా పెద్దదే ఉంది.
This post was last modified on September 29, 2025 5:07 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…