తమిళ నటుడు, ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చి తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరిట పార్టీని స్థాపించిన విజయ్ ఒక్క దెబ్బకు చిక్కుల్లో పడిపోయారు. మరో 7 నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటికే ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం కరూర్ లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది చనిపోగా… వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఇప్పుడు తమిళనాట రాజకీయ రంగు పులుముకుంది. ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన విజయ్… ఆదివారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఘటనపై సీబీఐ చేత విచారణ చేయించాలని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో విజయ్ అభ్యర్థించారు.
ప్రశాంతంగా జరుగుతున్న ర్యాలీలో రాళ్ల దాడులు, ఆపై ఏ కారణం లేకుండానే పోలీసుల లాఠీచార్జీ జరిగిందని టీవీకే ఆరోపిస్తోంది. ఈ పరిస్థితి చూస్తుంటే… టీవీకేను ఆదిలోనే తొక్కేయాలని రాష్ట్రంలోని అధికార, విపక్షాలన్నీ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నది విజయ్ అనుమానంగా తెలుస్తోంది. తొక్కిసలాట జరిగిన తర్వాత కరూర్ నుంచి గట్టి భద్రతా చర్యల మధ్య చెన్నై చేరుకున్న విజయ్… ఆదివారం ఉదయమే పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు లీగల్ సెల్ ముఖ్యులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీపై ఇతర పార్టీలు చేస్తున్న కుట్రలు, వాటిని ఎదుర్కొనే తీరుపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలోనే సీబీఐ విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించాలని తీర్మానించారు.
అనుకున్నదే తడవుగా ఆదివారం మధ్యాహ్నం టీవీకే లీగల్ సెల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర ఉందని, దీనిని నిగ్గు తేల్చాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థగా ఉన్న సీబీఐ చేత విచారణ చేయించాలని టీవీకే ఆ పిటిషన్ లో కోరింది. ఎలాంటి అలజడి లేకుండానే రాళ్ల దాడులు జరిగాయని, అదే సమయంలో ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా పోలీసులు తమ పార్టీ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారని, ఇవన్నీచూస్తుంటే… ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని తాము అనుమానిస్తున్నామని అందులో పేర్కొంది. ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
This post was last modified on September 28, 2025 2:53 pm
'టాక్సిక్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక…
కొరియన్ కనకరాజు సీక్వెల్ కి ప్లానింగ్ జరుగుతోంది. కెన్యా కనకరాజు పేరుతో స్క్రిప్ట్ డిస్కషన్లు మొదలయ్యాయని సమాచారం. అంటే కొరియా…
కోలీవుడ్ స్టార్ సూర్య సుడి బాగుంది. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ గజిని హీరోకి…
ఆగస్ట్ 21 ఇరుముడి విడుదలకు రంగం సిద్ధమయ్యింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ…
వరల్డ్ బిల్డింగులు, ఎలివేషన్లు, గ్యాంగ్ స్టర్ డ్రామాలు నిండిపోయిన ట్రెండ్ లో హీరోల డామినేషన్ తోనే కథలు రాస్తున్న దర్శకులు…
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…