దక్షిణాదిన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఏపీల్లో టికెట్ల ధరలు కొంచెం ఎక్కువే ఉన్నప్పటికీ.. కాస్త క్రేజున్న సినిమా రిలీజైందంటే చాలు.. అదనపు రేట్లు వడ్డించేస్తున్నారు. నిర్మాతలు అడగడం ఆలస్యం ఏపీలో రేట్ల పెంపుకు అనుమతులు వచ్చేస్తున్నాయి. తెలంగాణలో కూడా సెలక్టివ్‌గా రేట్లు పెంచుకునే సౌలభ్యం దక్కుతోంది. టాలీవుడ్ లేటెస్ట్ బిగ్ మూవీ ఓజీకి రెండు రాష్ట్రాల్లోనూ రేట్లు పెంచారు. ముందు రోజు ప్రిమియర్ షోలకు అయితే మూణ్నాలుగు రెట్ల అధిక ధరతో టికెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.
ఐతే ఈ అధిక ధరలు అంతిమంగా సినిమాలకు చేటే చేస్తుందని.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను తగ్గించేస్తుందనే చర్చ జరుగుతున్నప్పటికీ నిర్మాతలు తగ్గట్లేదు. అధిక రేట్ల వల్ల దెబ్బ తిన్న సినిమాలు చాలానే కనిపిస్తున్నా.. అదే సమయంలో తక్కువ రేట్లతో మంచి ప్రయోజనం పొందుతున్న సినిమాలు చాలానే ఉన్నా.. వాళ్లు మారడం లేదు. ఓజీ విషయంలో కూడా అధిక రేట్లు ఫుట్ ఫాల్స్‌ను కొంతమేర తగ్గిస్తున్న మాట వాస్తవం.
వీకెండ్లో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసినట్లుగా ఈ సినిమాను సామాన్య ప్రేక్షకులు సెలబ్రేట్ చేయకపోవడానికి అధిక రేట్లే కారణం. టికెట్ల ధరలు అందుబాటులో ఉంటే దసరా సెలవుల్లో సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశముంది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్లు నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు. ఓవరాల్‌గా సినిమాకు రేట్లు తగ్గించకపోయినా.. ఆంధ్రలో ఏరియాల వారీగా జాగ్రత్త పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆల్రెడీ రూ.200తో యూనిఫాం రేటు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఆల్రెడీ ఫుట్ ఫాల్స్ కూడా పెరిగాయట.
ఓజీకి పది రోజుల వరకు రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. కానీ అధిక రేట్లతో ఆదివారం వరకు ఓకే కానీ.. సోమవారం నుంచి సినిమా నిలబడాలంటే రేట్లు తగ్గించక తప్పదు. అలా తగ్గించి ఫుట్ ఫాల్స్ పెంచుకోవడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. దసరా సెలవుల అడ్వాంటేజీతో రెండో వీకెండ్ వరకు ఓజీ బండి లాగించొచ్చు. మిరాయ్ సినిమా రేట్లు తగ్గించడం ద్వారా అడ్వాంటేజీ తీసుకున్న నేపథ్యంలో ఓజీ డిస్ట్రిబ్యూటర్లందరూ రేట్ల తగ్గింపు దిశగా అడుగులేస్తే ఆశ్చర్యం లేదు.
This post was last modified on September 28, 2025 6:55 am
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…