Movie News

డ్రాకులా కామెడీలో రష్మిక మందన్న

యానిమల్, చావా బ్లాక్ బస్టర్ల పుణ్యమాని హీరోయిన్ రష్మిక మందన్న నార్త్ ఆడియన్స్ కి కూడా బాగా సుపరిచితురాలయ్యింది. సల్మాన్ ఖాన్ సికందర్ డిజాస్టర్ అయినా అవకాశాలకు లోటు లేదు కానీ అక్టోబర్ లో  తను నటించిన తమ్మా విడుదల కానుంది. స్త్రీ, స్త్రీ 2, భేడియా, ముంజ్యా నిర్మించిన మాడాక్ నిర్మాణ సంస్థ కావడంతో అంచనాలు బాగానే ఉండబోతున్నాయి. అందులోనూ హారర్ సిరీస్ కాబట్టి మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం బయ్యర్లలో ఉంటుంది. ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహించిన తమ్మాలో ఆయుష్మాన్ ఖురానా హీరో కాగా నవాజుద్దీన్ సిద్ధిక్ కీలకమైన విలన్ పాత్ర చేస్తున్నాడు. ఇవాళ ట్రైలర్ వచ్చింది.

కథేంటో అరటిపండు ఒలిచినట్టు చెప్పేశారు. వేల సంవత్సరాల వెనుక నుంచి వచ్చిన ఒక డ్రాకులా మెల్లగా మనుషుల్లో చేరుతుంది. ఆడపిల్ల రూపంలో కనిపించిన ఈమెను చూసి హీరో ఇస్టపడతాడు. కట్ చేస్తే అతనూ డ్రాకులాగా హఠాత్తుగా పళ్ళు పదునుగా మారిపోయి అవతలి వాళ్ళను భయపెడుతూ ఉంటాడు. ప్రియురాలి వల్లే ఈ పరిస్థితి వచ్చినా ఆమెను వదులుకోలేనంత ప్రేమిస్తాడు. అసలు ప్రమాదం అక్కడి నుంచి మొదలవుతుంది. లవర్ మంచితనాన్ని ఆమె అర్థం చేసుకున్నా భూమిని నాశనం చేసే లక్ష్యంతో ఉన్న ఒక దుర్మార్గుడు వీళ్లకు అడ్డుగా నిలుస్తాడు. ఆ తర్వాత జరిగేది థియేటర్లలో చూడాలి.

డ్రాకులా సిరీస్ కు హాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. ఈ ఫ్రాంచైజ్ లో ఎప్పుడు సినిమా వచ్చినా ఖచ్చితంగా చూసే ఆడియన్స్ ఉంటారు. కాకపోతే అవన్నీ సీరియస్ గా జరుగుతాయి. కానీ తమ్మలో డ్రాకులాతో కామెడీలు చేయించారు. మాడాక్ నిర్మిస్తున్న హారర్ సినిమాలన్నీ ఒక యునివర్స్ గా మారుస్తున్నారు. అన్ని దెయ్యాలు, విచిత్ర జంతువులు ఇంకో రెండు మూడు సంవత్సరాల తర్వాత చివరి భాగంలో కలుస్తాయి. అందుకే తమ్మలో స్త్రీ, భేడియా రెఫరెన్సులు వాడేశారు. రెగ్యులర్ గ్లామర్ పాత్రలకు భిన్నంగా రష్మిక మందన్న ఎంచుకున్న ఈ కొత్త జానర్ తనకు ఎలాంటి ఫలితం ఇవ్వనుందో అక్టోబర్ 21 తేలనుంది.

This post was last modified on September 26, 2025 8:41 pm

Share

Recent Posts

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago