Movie News

శ్రీదేవి, బోనీ కపూర్ పెళ్లి రహస్యం.. మొదటి భార్య ఇచ్చిన రింగ్స్!

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, నటి శ్రీదేవి ప్రేమకథ చాలాసార్లు వార్తల్లో నిలిచింది. 1996లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన మొదటి భార్య మోనాతో, ఇద్దరు పిల్లలతో ఉన్నారు. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం. ఇక తాజాగా బోనీ ఒక ఇంటర్వ్యూలో ఆ రోజులు గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా వారి పెళ్లి రింగ్స్ వెనుక ఉన్న నిజం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అయింది.

బోనీ ఇచ్చిన వివరణ ప్రకారం, ఆయన, శ్రీదేవి వేసుకున్న వెడ్డింగ్ రింగ్స్‌ను అసలు మొదటి భార్య మోనా కొనిచ్చారట. “నేను మోనాకు నిజం చెప్పాను. శ్రీదేవితో ఉన్న బంధం దాచలేదు. నేను ధరించిన రింగ్, శ్రీదేవి ధరించిన రింగ్ రెండూ మోనా కొన్నవే. ఆమె ఎప్పుడూ పిల్లల మనసులో నాపై ద్వేషం రానివ్వలేదు” అని బోనీ చెప్పారు.

అయితే ఈ నిర్ణయం ఆయన పిల్లలు అర్జున్, అంషులపై ప్రభావం చూపిందని బోనీ ఒప్పుకున్నారు. “నా కొడుకు అర్జున్ ఒక లేఖ ద్వారా ‘నాన్నా, ఇంటికి ఎందుకు రారు?’ అని అడిగాడు. అది నాకు చాలా బాధ కలిగించింది. కానీ నాకు రెండు వైపులా ఇబ్బంది. ఓవైపు శ్రీదేవి ఒంటరిగా ఉండేది, ఆమెను అలా వదిలేయలేక మాధనపడ్డాను. నా పిల్లలు మాత్రం అమ్మతో, తాతమ్మలతో ఉన్నారు” అని గుర్తు చేసుకున్నారు.

బోనీ తన జీవితంలో మోనా పాత్ర చాలా గొప్పదని చెప్పుకొచ్చారు. “ఆమె పిల్లల్ని నాపై గాని, శ్రీదేవి పిల్లలపై గాని వ్యతిరేకంగా మార్చలేదు. పిల్లలు ఆమె బాధ చూసి బాధపడేవారు, కానీ ఎప్పుడూ ద్వేషం పెంచలేదు. అందుకే ఇప్పుడు నా నలుగురు పిల్లలు.. అర్జున్, అంషులా, జాన్వీ, ఖుషి ఒక కుటుంబంలా కలసి ఉన్నారు” అని బోణి తెలిపారు. ఇక 2018లో శ్రీదేవి ఆకస్మిక మరణం తర్వాత ఈ కుటుంబం మరింత దగ్గరైంది. ఆ సమయంలో అర్జున్, అంషులా ఇద్దరూ జాన్వీ, ఖుషికి అండగా నిలిచారు. తల్లి కోల్పోయిన బాధలో అన్నచెల్లెళ్ళు, అక్కాచెల్లెళ్ళు ఒకరికొకరు తోడుగా ఉన్నారు. 

This post was last modified on September 26, 2025 4:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజధాని ఎఫెక్ట్: వైసీపీలో చీలిక?

వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…

58 minutes ago

కోర్టు కటాక్షం… జన నాయకుడికి మోక్షం

ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…

2 hours ago

ఇంట్లో బంగారం… తీరులో భయంకరం

వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…

2 hours ago

రాజా సాబ్ రాకతో థియేటర్లు కళకళా

ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…

3 hours ago

కేసీఆర్‌కు భారీ ప్రాధాన్యం… రేవంత్ రెడ్డి వ్యూహ‌మేంటి?

ఏ రాష్ట్రంలో అయినా... ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు ప్ర‌భుత్వాలు పెద్ద‌గా ఇంపార్టెన్స్ ఇవ్వ‌వు. స‌హ‌జంగా రాజ‌కీయ వైరాన్ని కొన‌సాగిస్తాయి. ఏపీ స‌హా…

3 hours ago

అమ‌రావతిపై మళ్లీ రచ్చ మొదలెట్టిన జగన్

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీల‌కు…

4 hours ago