‘మిరాయ్’ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి బజ్ క్రియేట్ కావడంలో ‘వైబ్’ సాంగ్‌ది కీలక పాత్ర. మంచి బీట్ ఉన్న ఆ పాట ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో బాగా వైరల్ అయింది. యూత్‌కు ఆ పాట బాగా ఎక్కేసింది. అందులో హీరో తేజ సజ్జ, హీరోయిన్ రితిక నాయక్‌ల లుక్స్, స్టెప్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఐతే ఇంత ఆకర్షణీయమైన పాటను సినిమాలో పెట్టలేదు టీం. నిడివి ఎక్కువైపోవడం, ప్లేస్మెంట్ సరిగా కుదరకపోవడం వల్ల ఆ పాటను తీసేశారు.
సినిమాలో ఈ పాట కోసం ఎదురు చూసిన యువ ప్రేక్షకులు బాగా నిరాశ చెందారు. ఇది పెద్ద స్కామ్ అంటూ సెటైర్లు వేశారు. ఆ పాటను పెట్టాలని ప్రయత్నించినా కుదరలేదని మేకర్స్ పేర్కొన్నారు. ఐతే రిలీజైన కొన్ని రోజులకు ఈ పాట సినిమాలో కలుస్తుందని వార్తలు వచ్చాయి. దాని కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ పుణ్య కాలం అంతా గడిచిపోయాక ఇప్పుడు ఆలస్యంగా వైబ్ సాంగ్‌ను థియేటర్లలో ఎటాచ్ చేసింది చిత్ర బృందం.
కానీ గత వీకెండ్లో ఈ పాటను యాడ్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. కానీ రెండో వీకెండ్ అయ్యాక ‘మిరాయ్’ స్లో అయింది. ఇప్పుడు జనం దృష్టి ‘ఓజీ’ మీదికి మళ్లింది. ఆ సినిమా తాలూకు యుఫోరియాలో మునిగిపోయి ఉన్నారు యూత్. దాని ముందు వేరే సినిమాలను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ‘వైబ్’ సాంగ్ వల్ల ‘మిరాయ్’కు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవచ్చు. ఆ పాటను కలపకుండా వదిలేసినా పోయేది. కలపాలని అనుకుంటే కొన్ని రోజుల ముందే ఆ పని చేస్తే ప్రయోజనం ఉండేది. ఇప్పుడు ఈ పాట కోసం థియేటర్లకు వెళ్లే వాళ్లు తక్కువగానే ఉంటారు. ఇక ఓటీటీలో వచ్చినపుడు చూసుకుందాం అనుకునేవాళ్లే ఎక్కువగా ఉంటారనడంలో సందేహం లేదు.
This post was last modified on September 24, 2025 6:51 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…