ఓజి కోసమో లేక పోస్ట్ ప్రొడక్షన్ లో ఆలస్యం వల్లనో కారణం ఏదైతేనేం సెప్టెంబర్ 25 రావాల్సిన అఖండ 2 కొత్త డేట్ ఎప్పుడాని అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్ వదలుకున్న డిసెంబర్ 5 రావడం ఖాయమని గతంలోనే లీక్స్ వచ్చినప్పటికీ దానికి బాలయ్య ద్వారానే అధికారిక ముద్ర పడిపోయింది. అదే తేదీకి భారీ ఎత్తున విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు, ప్యాన్ ఇండియా భాషల్లో ఒకేసారి వస్తుందని అసెంబ్లీలో జరిగిన ప్రైవేట్ చిట్ ఛాట్ లో చెప్పేయడంతో అనుమానం మబ్బులు వీడిపోయాయి. అఖండ మొదటి భాగం మూడేళ్ళ క్రితం డిసెంబర్ లోనే వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
నిజానికి సంక్రాంతికి అయితే బెటరనుకున్నారు కానీ ఎలా చూసుకున్నా డిసెంబర్ 5 బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే సోలో డేట్ ప్రతిసారి దొరకదు. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా రిస్క్ అయిపోయింది. ఒంటరిగా వస్తే కలిగే లాభాలేంటో కల్కి, దేవర, పుష్ప 2, ఓజిలు నిరూపించాయి. సో పండక్కు వెళ్లి అయిదారు సినిమాలతో పోటీ పడటం కన్నా ఇలా సోలోగా వస్తే ఓపెనింగ్స్ తో పాటు ఫైనల్ రన్ పెద్దది దక్కుతుంది. అదే డేట్ కి రావాలనుకున్న రణ్వీర్ సింగ్ బాలీవుడ్ మూవీ దురంధర్ వాయిదా పడటం దాదాపు పక్కానే. అదే జరిగితే అటు హిందీ మార్కెట్ లోనూ ఓపెన్ గ్రౌండ్ దొరికి వసూళ్లు పెరుగుతాయి.
ఇటీవలే ఒక పాట షూట్ చేసిన దర్శకుడు బోయపాటి శీను దాదాపు గుమ్మడికాయ కొట్టేసినట్టే. టాకీ పార్ట్ కు సంబంధించిన డబ్బింగ్ గత నెలే పూర్తి చేశారు. విఎఫ్ఎక్స్ పనులు కొలిక్కి వస్తున్నాయి. ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా నవంబర్ మూడో వారంకల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేయబోతున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న అఖండ 2కు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. వచ్చే నెల రీ రికార్డింగ్ మొదలు పెట్టొచ్చని అంటున్నారు. దసరా పండక్కు మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారు. టీజర్ లేదా ట్రైలర్ దీపావళికి వదలబోతున్నటు సమాచారం.
This post was last modified on September 23, 2025 10:10 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…