వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్‍ని దృష్టిలో వుంచుకుని హీరోయిన్‍తో ఒక చిన్న ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారనేది తెలిసిందే. ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం దాదాపు పది రోజుల వర్క్ వుంటుందట. ఇందులో పవన్‍కి జోడీగా గబ్బర్‍సింగ్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తోంది. పది రోజుల పాటు నటించాల్సిన పాత్ర అయినా కానీ తనకిప్పుడు ‘క్రాక్’ సినిమాకు ఎంత ఇచ్చారో అంతే ఇవ్వాలని శృతి హాసన్ డిమాండ్ చేసిందట.
మామూలుగా తక్కువ రోజుల వర్క్ వుండే చిత్రాలకు హీరోయిన్లు కాస్త రిబేట్ ఇస్తుంటారు. అదే ఐటెమ్ సాంగ్ చేయాల్సి వస్తే మాత్రం బాగా డిమాండ్ చేస్తారు. కానీ ఈ అతిథి పాత్ర చేయడానికి శృతి హాసన్ ఫుల్ పేమెంట్ అడిగిందట. మామూలుగా బేరసారాలు నడిపే దిల్ రాజు కూడా ఆమె డిమాండ్‍కు తలొగ్గాడట. ఇప్పుడు శృతితో పేచీ పెట్టుకుని, మరో హీరోయిన్ కోసం వెతకడం మొదలు పెడితే ఈ చిత్రం షూటింగ్ మళ్లీ వాయిదా పడుతుందని దిల్ రాజు తన పద్ధతులకు భిన్నంగా శృతిహాసన్ అడిగినంత ఇవ్వడానికి అంగీకరించాడట.
This post was last modified on November 26, 2020 1:30 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…