విదేశీ లగ్జరీ కార్లకు కస్టమ్ సుంకాలు చెల్లించకుండా.. దొడ్డిదారిలో సొంతం చేసుకున్నారన్న ఆరోపణలతో ప్రముఖ బహుభాషా నటులు, మలయాళ సినీ రంగానికి చెందిన దుల్కర్ సల్మాన్(మహానటి ఫేమ్), పృథ్వీరాజ్ సుకుమారన్ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల ఇళ్లపై కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. `ఆపరేషన్ నమకూర్` పేరుతో నిర్వహించిన ఈ దాడులలో నటుల ఆస్తులు, వారి లగ్జరీ కార్లపై అధికారులు దృష్టి పెట్టారు. అదేవిధంగా బ్యాంకు ఖాతాలు.. ఆదాయ వ్యయాల వివరాలను కూడా సేకరించారు.
అసలేంటీ కేసు?
ఇతర దేశాలు.. కొన్ని కొన్ని సందర్భాల్లో వాడని లగ్జరీ కార్లను తక్కువ ధరలకు విక్రయిస్తాయి. వాటిని ప్రముఖులు కొనుగోలు చేస్తుంటారు. ఇలా.. భారత్‌కు పొరుగున ఉన్న భూటాన్ సైన్యం కొనుగోలు చేసి కూడా ఉపయోగించని కొన్ని ఖరీదైన వాహనాలను విక్రయించింది. వీటిని కొందరు ఏజెంట్లు వేలంలో అతితక్కువ ధరకు దక్కించుకున్నారు. అనంతరం.. వాటిని ఇతరులకు విక్రయించారు. ఇలా.. కొనుగోలు చేసిన వాటికి కస్టమ్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అలా చెల్లించకుండానే భారత్‌కు తీసుకువచ్చారన్నది కస్టమ్ అధికారుల వాదన.
ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేరళ, తమిళనాడు, కర్ణాటకల లోని సినీ ప్రముఖులు, వ్యాపారుల ఇళ్లపై కస్టమ్ అధికారులు దాడులు చేశారు. అయితే.. కేరళ సినీ రంగా నికి చెందిన ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్‌లు ఎలాంటి వాహనాలుకొనుగోలు చేయలేద ని గుర్తించినట్టు తెలిసింది. అయితే.. దాడులు కొనుసాగుతున్నట్టు కస్టమ్ అధికారులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates