కొందరు హీరోయిన్లు గ్లామర్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తారు. కొందరు కేవలం నటనతోనే మెప్పిస్తారు. వారిని గ్లామర్ కోణంలో అభిమానులు చూడరు. ఈ రెండో కోవకు చెందిన హీరోయిన్లు హాట్ హాట్‌గా కనిపించే ప్రయత్నం చేసినా వ్యతిరేకత వ్యక్తమవుతుంటుంది. వాళ్లను సంప్రదాయబద్ధంగా చూడడానికే ఫ్యాన్స్ ఇష్టపడతారు. సాయిపల్లవి ఈ కోవకే చెందుతుంది. తొలి చిత్రం ‘ప్రేమమ్’ నుంచి ఆమె తన పెర్ఫామెన్స్‌తోనే ఆకట్టుకుంటోంది. తనలో గ్లామర్ కోణం ఎప్పుడూ ఎలివేట్ కాలేదు. ఫిలిం మేకర్స్ కూడా తనను అలా చూపించడానికి పెద్దగా ఆసక్తి ప్రదర్శించారు.
ఇలాంటి టైంలో సాయిపల్లవి స్విమ్ సూట్, బికినీ డ్రెస్సుల్లో కనిపించేసరికి ఫ్యాన్స్ షాకవుతున్నారు. తన చెల్లెలితో కలిసి వెకేషన్‌కు వెళ్లిన సాయిపల్లవి.. స్విమ్ సూట్, బికినీల్లో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఈ ఫొటోలు తెగ తిరుగుతున్నాయి. వీటిని చూసి సాయిపల్లవి కూడా ఇలా తయారైపోయిందేంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
కొందరు ‘రామాయణం’ లాంటి సినిమాలో నటిస్తూ ఇవేం వేషాలు అంటూ తిట్టిపోస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే.. అవి ఒరిజినల్ ఫొటోలు కావు. సాయిపల్లవి సోదరి షేర్ చేసిన కొన్ని ఫొటోలను ఆధారంగా చేసుకుని.. ఈ స్టార్ హీరోయిన్ స్విమ్ సూట్లో ఉన్నట్లు, టూపీస్ బికినీ వేసినట్లు ఫొటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ సాయిపల్లవి సోదరి ఇన్‌స్టా అకౌంట్లోకి వెళ్తే ఇవి ఫేక్ అనే విషయం అర్థమైపోతుంది. కానీ అది తెలియక చాలామంది తప్పుగా అర్థం చేసుకుని ఇవి ఒరిజినల్ అనుకుంటున్నారు. సాయిపల్లవిని ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on September 23, 2025 7:36 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…