కిష్కింధపురి.. ఈ వారం మంచి అంచనాల మధ్య బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమా. రిలీజ్‌కు ముందు రోజే ఈ చిత్రానికి పెద్ద ఎత్తున పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. వాటి నుంచి మంచి టాకే వచ్చింది. ఆ షోలన్నీ చాలా వరకు ఫుల్స్ అయ్యాయి. తొలి రోజు ఈ చిత్రానికి మోడరేట్ రివ్యూలు రాగా.. ఆడియన్స్ రెస్పాన్స్ పర్వాలేదనిపించింది. ఐతే ‘మిరాయ్’ లాంటి మంచి హైప్ ఉన్న సినిమాతో పోటీ పడడం దీనికి ప్రతికూలంగా మారింది.
నిజానికి సెప్టెంబరు 12న ఆ చిత్రం సోలోగా రిలీజ్ కావాల్సింది. కానీ సెప్టెంబరు 5కు అనుకున్న ‘మిరాయ్’ని వారం వాయిదా వేశారు. ఒక దశలో దుల్కర్ సల్మాన్ సినిమా ‘కాంత’ కూడా 12కే వస్తుందనుకున్నారు. కానీ ఆ చిత్రం పోటీ నుంచి తప్పుకుంది. దుల్కర్ సినిమా పోటీలో ఉండి, ‘మిరాయ్’ రాకపోతే ‘కిష్కింధపురి’ కచ్చితంగా బాక్సాఫీస్ విన్నర్ అయ్యేదేమో. కానీ ‘మిరాయ్’తో పోటీ పడడం మాత్రం మైనస్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
రిలీజ్‌కు ముందు రోజు రాత్రంతా ‘కిష్కింధపురి’నే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. కానీ ఉదయానికి పరిస్థితి మారిపోయింది. ‘మిరాయ్’ సోషల్ మీడియాను ముంచెత్తేసింది. ముందు ఉన్న హైప్‌కు తోడు.. ఆ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూలు రావడంతో తొలి రోజు హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. సినిమాలో ఉన్న కంటెంట్‌కు మించి ‘మిరాయ్’కి పాజిటివ్ టాక్, హైప్ వచ్చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందీలో సైతం ఆ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమా రేంజే మారిపోయేలా కనిపిస్తోంది.
‘కిష్కింధపురి’ డీసెంట్ హార్రర్ థ్రిల్లర్ అనడంలో సందేహం లేదు. జానర్ లవర్స్ కచ్చితంగా దీన్ని ఇష్టపడతారు. బి, సి సెంటర్లలో ఎలాగూ బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఫాలోయింగ్ ఉంది. ఇదే సినిమా కనుక సోలోగా రిలీజైతే అది ‘రాక్షసుడు’ తరహాలోనే పెద్ద హిట్టయ్యే అవకాశముండేది. కానీ ఇప్పుడు ‘మిరాయ్’తో పోటీ వల్ల బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడలేకపోతోంది. వసూళ్ల పరంగా యావరేజ్ స్థాయిని మించడం కష్టంగానే కనిపిస్తోంది.
This post was last modified on September 22, 2025 10:27 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…