‘గబ్బర్ సింగ్’ సినిమా రిలీజైనపుడు ఆ సినిమా చూసి జై పవర్ స్టార్ అనుకుంటూ బయటికి వచ్చిన సగటు పవన్ కళ్యాన్ అభిమాని సుజీత్. ఈ రోజు పవన్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న ‘ఓజీ’ సినిమాను అతను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు.. రికార్డుల మోత మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం రెండు సినిమాల అనుభవంతోనే అతను పవన్‌తో పని చేసే అవకాశం దక్కించుకున్నాడు. అతడి చివరి చిత్రం ‘సాహో’ రేంజ్ ఏంటో తెలిసిందే. ఇంత భారీ చిత్రం చేయడానికి పునాది వేసిన మూవీ.. రన్ రాజా రన్. శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్టయింది.
ఈ సినిమా కార్యరూపం దాల్చడం వెనుక పెద్ద స్టోరీనే ఉందంటున్నాడు సుజీత్. ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా వెనుక బ్యాక్ స్టోరీని అతను వెల్లడించాడు. ఆ సంగతులు తన మాటల్లోనే.. ‘‘అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఒక మంచి ప్రేమకథ రాసుకున్నా. ఒక ప్రొడక్షన్ హౌస్‌కు వెళ్లి కథ వినిపించా. వారికి ఫస్టాఫ్ నచ్చింది. సెకండాప్ కోసం ఐదు నెలలు పని చేశా. మంచి వెర్షన్ రాసి మళ్లీ ప్రొడక్షన్ హౌస్‌ను కలిసి వినిపించా. వాళ్లు సూపర్ అన్నారు. సినిమా ఓకే అయిందన్న సంతోషంలో బైక్ మీద బయల్దేరా.
నా ఫోన్ రింగయింది. పక్కన ఆపి కాల్ తీస్తే.. ఆ కథకు బడ్జెట్ ఎక్కువ అయ్యేలా ఉంది. వేరే కథ ఆలోచించమని నిర్మాత చెప్పారు. నా మైండ్ ఆగిపోయింది. అప్పుడే వర్షం మొదలైంది. రోడ్డు పక్కన కూర్చుని మూడు గంటలు ఏడ్చాను. వెన్నెల కిషోర్‌కు ఫోన్ చేస్తే తను ధైర్యం చెప్పాడు. షార్ట్ ఫిలిం గంటలో రాయగలవు. సినిమా ఒక రోజులో రాయలేవా అన్నాడు. సరే అనుకుని బండి స్టార్ చేస్తే అది కదల్లేదు. పెట్రోల్ అయిపోయింది. చేతిలో డబ్బుల్లేవు. జోరు వాన. బండిని నెట్టుకుంటూ జూబ్లీ హిల్స్ నుంచి ముషీరాబాద్ వరకు వచ్చాను. ఆ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు.
ఇంటికొచ్చి తల తుడుచుకుంటుంటే రన్ రాజా రన్ కథ ఫ్లాష్ అయింది. వెంటనే ప్రొడక్షన్ వాళ్లకు ఫోన్ చేసి సంవత్సరం నుంచి ఒక కథ రాస్తున్నా, చెప్పమంటారా అన్నాను. రేపు వచ్చేయమన్నారు. మూడు రోజుల తర్వాత వస్తా అని చెప్పి.. ఆ మూడు రోజుల్లోనే కథ రాసుకుని వెళ్లి వినిపించా. వాళ్లు చిన్న మార్పు చెప్పకుండా సినిమా ఓకే చేశారు. ఒక ఓటమి వచ్చిందని బాధ పడకూడదు. మరో ప్రయత్నం మనల్ని విజయతీరాలకు చేరుస్తుందనడానికి ఇది ఉదాహరణ’’ అని సుజీత్ చెప్పాడు.
This post was last modified on September 22, 2025 8:00 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…