మొన్న విడుదలైన కొత్త సినిమాల్లో ప్రమోషన్ల పరంగా అంతో ఇంతో హైలైటయ్యింది బ్యూటీ ఒక్కటే. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం, నిర్మాతల్లో ఒకరైన మారుతీ పవన్ కళ్యాణ్ పేరు ఉపయోగించి ఎలివేషన్లు ఇవ్వడం, ముందు రోజు రాత్రి హైదరాబాద్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో ఎస్కెఎన్ ఫ్రీ షో ఆఫర్ చేయడం లాంటివి అంతో ఇంతో బజ్ అయితే తీసుకొచ్చాయి. హీరో అంకిత్ కొయ్యకు మార్కెట్ లేని దృష్ట్యా పబ్లిసిటీ పరంగా ఇలాంటి ప్లానింగ్ చేసుకున్నారు. ఓజికి వారం ముందు వస్తున్నా సరే కంటెంట్ నిలబెడుతుందనే ధైర్యంతో రిలీజ్ చేశారు. ట్రైలర్ చూశాక యూత్ తో పాటు మాస్ లో కాసిన్ని అంచనాలైతే నెలకొన్నాయి.
కానీ బ్యూటీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. తెలిసి తెలియని వయసులో గుడ్డిగా అబ్బాయిలను నమ్మడం ఎంత ప్రమాదమో, తల్లి తండ్రుల ప్రేమను గుర్తించకపోవడం ఎంతటి విపత్తులకు దారి తీస్తుందో చెప్పే ప్రయత్నం బాగానే ఉంది కానీ నెరేషన్ రొటీన్ ఫార్మాట్ లో వెళ్లడంతో పాటు కుర్రాళ్లకు అంతగా డైజెస్ట్ కానీ కొన్ని విషయాలు పెట్టడం ఫ్లోని దెబ్బ తీసింది. సెకండాఫ్ మొత్తం సీరియస్ గా నడవడమే కాదు అసలు ట్విస్టు మొన్నటి ఏడాది వచ్చిన ఒక ఫ్లాప్ మూవీకి దగ్గరగా ఉండటం కనెక్టివిటీని తగ్గించింది. బేబీ తరహాలో సర్ప్రైజ్ సెన్సేషన్ అవుతుందనుకున్న నిర్మాతకు ఆ కోరిక నెరవేరేలా లేదు.
బ్యూటీకి ఇక చేతిలో ఉన్నది మూడు రోజులే. బ్రేక్ ఈవెన్ చేసుకుంటే హిట్టు క్యాటగిరీలో పడుతుంది. కానీ ఆదివారం సైతం పెద్దగా వసూళ్లు లేకపోవడం నిరాశ కలిగించే విషయం. ఓజి విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్లు దాని కోసం రెడీ అవుతున్నాయి. ఈ లెక్కన బ్యూటీ రెండో వారం కంటిన్యూ కావడం అనుమానమే. నరేష్ పెర్ఫార్మన్స్, హీరోయిన్ నిలకి పత్ర నటన మెయిన్ హైలైట్స్ గా నిలిచిన బ్యూటీకి విజయ్ బుల్గానిన్ సంగీతం ప్లస్ గా నిలిచింది. అయినా లిటిల్ హార్ట్స్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చూసిన కళ్ళకు బ్యూటీ లాంటి సీరియస్ డ్రామాలు అనడం కష్టమే. రిజల్ట్ రూపంలో అదే కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates