ఇప్పుడంటే ఓజి నామస్మరణలో అభిమానులు తేలుతున్నారు కానీ కెరీర్ ప్రారంభంలో పవన్ తో పని చేసిన నటీనటులు హీరోయిన్లు పంచుకునే కబుర్లు ఆయనకు సంబంధించినవి కాకపోయినా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. గోకులంలో సీతలో పవన్ సరసన నటించిన రాశి అప్పట్లో మంచి స్టార్ డం చూశారు. ప్రేయసి రావే, మానసిచ్చి చూడు, స్నేహితులు, దేవుళ్ళు లాంటి ఎన్నో సూపర్ హిట్లు ఆవిడ ఖాతాలో ఉన్నాయి. చిరంజీవితో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం గురించి ఇప్పటికీ బాధ పడుతూ ఉంటారు. ఈ మధ్య రాశి మళ్ళీ బిజీ అయ్యారు. రెగ్యులర్ గా సినిమాల్లో కనిపిస్తూ పలు విశేషాలు చెబుతున్నారు.
మహేష్ బాబు నిజం టైంలో దర్శకుడు తేజ రాశికి పాజిటివ్ యాంగిల్ లో ఉంటుందని ఒక పాత్ర చెప్పి ఒప్పించారు. హీరోయిన్ కాకపోయినా సరే పెర్ఫార్మన్స్ కు ప్రాధాన్యం ఉందనే ఉద్దేశంతో సరేనన్నారు. సెట్టుకు వెళ్లిన మొదటి రోజే చేయకూడదనిపించే సన్నివేశాన్ని షూట్ చేశారు. దీని వల్ల కెరీర్ దెబ్బ తింటుందని రాశి భయపడి వద్దని చెప్పింది. కానీ చేయాల్సిందేనని కండీషన్ పెట్టడంతో విధి లేక పూర్తి చేయాల్సి వచ్చింది. అనుకున్నట్టే రాశికి నిజం వల్ల డ్యామేజయ్యింది. డబ్బింగ్ టైంలో తేజ క్షమాపణ అడిగినా రాశి అంగీకరించలేదు. జీవితంలో మర్చిపోయే డైరెక్టర్లలో ఆయన పేరే మొదటిదట.
ఇవన్నీ రాశినే ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రంగస్థలంలో అనసూయ కన్నా ముందు రంగమ్మత్త క్యారెక్టర్ ఆఫర్ చేసింది రాశికే, సుకుమార్ చెప్పినప్పుడు బాగానే అనిపించినా ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదోననే అనుమానంతో రాశి నో చెప్పేశారు. ఒకవేళ చేసుంటే ఇప్పుడు ఇన్నింగ్స్ మరింత గొప్పగా ఉండేవేమో. తనకు పెళ్ళైన టైంలోనే సౌందర్య చనిపోవడం, నిజం తర్వాత తన పుట్టినరోజునాడే తండ్రి కన్నుమూయడం అత్యంత విషాదాలుగా చెప్పుకునే రాశి మళ్ళీ పవన్, చిరంజీవి లాంటి మెగా హీరోల సినిమాల్లో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈసారి రంగస్థలం మిస్ చేసుకోవడం లాంటి పొరపాట్లు చేయకపోవచ్చు.
This post was last modified on September 21, 2025 6:33 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…