విశ్వంభర ఆలస్యానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ అన్నది బహిరంగ రహస్యమే అయినా బడ్జెట్ సమస్యలు కూడా చుట్టముట్టడం వల్లే యువి క్రియేషన్స్ లేట్ చేసిందనేది ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం. దానికి తగ్గట్టే అఖిల్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీని వాయిదా వేసుకుని హీరోని లెనిన్ కోసం వదిలేయడం, హిట్టయ్యి ఆర్థిక బలం ఇస్తుందంటే ఘాటీ డిజాస్టర్ కావడం లాంటి కారణాలు విశ్వంభరను ఇంకా వెనక్కు నెట్టేలా చేశాయి. దెబ్బకు మన శంకరవరప్రసాద్ గారుని సంక్రాంతికి తీసుకురావాల్సి వచ్చింది. మరి మెగా మూవీకి మోక్షం ఎప్పుడో, కొత్త రిలీజ్డ్ డేట్ ఏదో సరైన క్లారిటీ లేదు.
మావయ్య చిరంజీవికి వచ్చిన సమస్యే అల్లుడు సాయి ధరమ్ తేజ్ కీ చుట్టుకుంది. సంబరాల ఏటిగట్టు ఎప్పుడో నెలల క్రితం సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ వేసుకున్నారు. కానీ ఓజికి లాక్ చేసుకున్నాక ఇది రాదని అందరికీ అర్థమైపోయింది. కానీ టీమ్ మాత్రం వాయిదా గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. భారీ సెట్లు, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, సాయి తేజ్ సిక్స్ ప్యాక్ బాడీ ఇలా చాలానే కష్టపడ్డారు. హనుమాన్ నిర్మాతల బ్యానర్ కావడంతో బడ్జెట్ విషయంలో రాజీ లేదన్నారు. తీరా చూస్తే ఖర్చు చేయి దాటిపోవడంతో కొంత బ్రేకులు వేశారనేది అనఫీషియల్ గా తిరిగిన న్యూసు.
ఇప్పుడీ సంబరాల ఏటిగట్టుకి సైతం విడుదల తేదీ స్పష్టత లేదు. మొన్న ఇచ్చిన మీడియా నోట్ లో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ కోసం లేట్ అవుతోందని, సాంకేతిక కారణాలు చెబుతూ త్వరలో శుభవార్త వినిపిస్తామని అందులో సుదీర్ఘంగా పేర్కొన్నారు. 2025లో రావడం కష్టమే. ఎందుకంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా నెలకు రెండు మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. పోనీ జనవరి అంటే అదేమో ప్యాకైపోయింది. సంబరాల ఏటిగట్టుకి సోలో రిలీజ్ చాలా ముఖ్యం. అది కూడా అంత సులభం కాదు. 2026 వేసవిలో విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. మావయ్యలు లేని టైం చూసుకుని సాయి తేజ్ స్లాట్ బుక్ చేసుకోవాలి.
This post was last modified on September 21, 2025 5:58 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…