మొన్నటి దాకా ఎవరూ పట్టించుకోని సినిమా హఠాత్తుగా మైత్రి సంస్థ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడంతో కాసింత వెలుగులోకి వచ్చింది. కిష్కిందపురి ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో మూవీ లవర్స్ ఒక లుక్ వేద్దామనుకున్నారు. అదే ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు. టైటిలే ఇంత వెరైటీగా ఉందంటే 100 నిముషాలు సింగల్ షూట్ లో ఏకధాటిగా తీసిన మూవీగా ప్రచారం జరగడంతో సినీ ప్రియులు ఆసక్తి చూపించిన మాట వాస్తవం. ఇంత హడావిడి జరిగింది కాబట్టే మార్నింగ్ షోలలో జనం కనిపించారు. సంధ్య థియేటర్ లో ఉదయం స్పెషల్ షో దాదాపు నిండిపోయింది.
ఇంతా చేసిన హీరో కం దర్శకుడు సూపర్ రాజా ఆడియన్స్ సహనంతో ఫుట్ బాల్ ఆడుకున్నాడు. ఒక మధ్యతరగతి కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చి నాని, రవితేజ లాగా ఏలాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ క్రియేటివిటీకి కొన్ని కొలతలు ఉన్నాయి. ప్రేక్షకుల టికెట్ డబ్బులకు గౌరవం ఇవ్వాలి. అంతే కానీ నేను సింగల్ షాట్ లో తీశాను, డబ్బులన్నీ పెట్టాను అంటే సానుభూతి రాదు. ఇంతా చేసి కథలో ఏముందంటే ఇద్దరు స్నేహితులు బైక్ మీద ప్రయాణం చేస్తూ హైదరాబాద్ మొత్తం చుట్టేస్తారు. ఎందుకంటే జర్మనీ వెళ్ళబోతున్న ఒక అమ్మాయిని ఆపడానికి. కారణాలు తెలుసుకోవాలంటే థియేటర్ కు వెళ్లి తరించాల్సిందే.
షో అయ్యాక జనాలు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ వింటే సదరు సూపర్ రాజా మళ్ళీ ఇలాంటి సాహసం చేయకపోవచ్చనిపిస్తోంది. నేను మంచి కంటెంట్ ఇచ్చానని పదే పదే పదిసార్లు అరిచి చెప్పడం కాదు, ఒక్కసారైనా సినిమా చూసిన పబ్లిక్ అనుకోవాలి. కానీ సూపర్ రాజా ఒక్క శాతం కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు. యూట్యూబ్ లో ఉన్నా చిరాకు కలిగించే ఇలాంటి మేకింగ్ ఏకంగా బిగ్ స్క్రీన్ దాకా తీసుకురావడం ఇతనికి దక్కిన పెద్ద సక్సెస్. నువ్వు నాకు నచ్చావ్ లో భోజనం టేబుల్ దగ్గర ఎంఎస్ నారాయణ హీరో వెంకటేష్ ని ఉద్దేశించి ప్రార్ధన కొత్తగా కాదు వింతగా ఉంది అంటారు. ఈ సూపర్ రాజా మూవీకి ఇది అచ్చంగా సరిపోతుంది.
This post was last modified on September 19, 2025 10:41 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…