కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కె రాంప్ కు సంబంధించి ఇప్పటిదాకా రెండు టీజర్లు వచ్చాయి. యూత్ ఫుల్ గా ఉన్నాయి. తను ఇప్పటిదాకా ట్రై చేయని కొత్త కామెడీ టింజ్ ట్రై చేసిన కిరణ్ వెరైటీ టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఒక యుట్యూబ్ రివ్యూయర్ ని ఇమిటేట్ చేయడం దగ్గరి నుంచి అమ్మాయిల మీద వేసే జోకులు దాకా రకరకాల షేడ్స్ చూపించాడు. ఇదంతా బాగానే ఉంది కానీ కావాల్సినన్ని బూతులు జొప్పించడం యువతకేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఎబెట్టుగా అనిపించేలా ఉంది. బూతుని నేరుగా వాడకుండా అది ఏ బూతో స్పష్టంగా అర్థమయ్యేలా డైలాగులు రాసుకున్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి డబుల్ మీనింగ్స్ ఉంటే యూత్ ఎక్కువగా అట్రాక్జ్ అవుతారనే అంచనా ఏమైనా కిరణ్ లో ఉందేమో చూడాలి. ఒకవేళ అదే అయితే ఇది నిజం కాదని గుర్తించాలి. ఎందుకంటే ఇటీవలే విడుదలైన సెన్సేషన్ లిటిల్ హార్ట్స్ లో ఒకటి రెండు తప్ప ఎక్కడ అసభ్యత, ద్వందార్థాలు లేవు. క్లీన్ ఎంటర్ టైన్మెంట్ తో దర్శకుడు సాయి మార్తాండ్, హీరో మౌళి మెప్పించారు. కానీ కె రాంప్ దానికి పూర్తి విభిన్నంగా అనిపిస్తోంది. కథ పరంగా సింపుల్ గానే అనిపిస్తోంది. కేరళకు చదువు కోసం వెళ్లిన ఓ అల్లరి కుర్రాడు అక్కడి అమ్మాయిని ప్రేమించి ఏం చేశాడనే పాయింట్ మీద రూపొందించారు.
ఫ్లాపులను పక్కనపెడితే ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ, క ఇలా ఒక ఫ్లోలో క్లీన్ ఎంటర్ టైన్మెంట్ తో వెళ్తున్న కిరణ్ అబ్బవరం కేవలం ట్రెండ్ ని ఫాలో అవుతూ టార్గెట్ ఆడియన్స్ కోసం రూటు మార్చాడా లేక తనలో మరో కోణం కూడా ఉందని నిరూపించుకోవడానికి ఇలా చేశాడా అనేది వేచి చూడాలి. వచ్చే నెల 18 విడుదల కాబోతున్న కె రాంప్ కు పోటీగా సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా వస్తోంది. అదేమో సాఫ్ట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కె రాంప్ ఏమో ఊర మాస్ సరదా ప్రేమకథ. కిరణ్ అబ్బవరంకు దిల్ రుబా చేసిన గాయం మానాలంటే కె రాంప్ ఓ రేంజ్ లో హిట్టవ్వాల్సిందే.
This post was last modified on September 19, 2025 5:51 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…