Movie News

జూనియర్ షారుఖ్ కోసం బాలీవుడ్ కదిలొచ్చింది

కొన్నేళ్ల క్రితం మాదకద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్ ఇరుక్కున్నప్పుడు షారుఖ్ ఖాన్ పడ్డ నరకం అంతా ఇంతా కాదు. వారసుడిగా తన లెగసిని మోస్తాడనుకున్న టైంలో పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగడం అభిమానులను కలచి వేసింది. తర్వాత దాన్నుంచి బయటికి రావడం, కథ సుఖాంతం కావడం వేరే సంగతి. తాజాగా ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన బాడ్స్ అఫ్ బాలీవుడ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. మొత్తం ఏడు ఎపిసోడ్లు, ఒక్కొక్కటి నలభై అయిదు నుంచి యాభై నిమిషాల నిడివితో ప్రేక్షకుల సమయాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది. ట్రైలర్ మీద మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

కంటెంట్ ఎలా ఉందనేది కాసేపు పక్కనపెడితే బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ కోసం నిన్న వేసిన ప్రీమియర్ కు తారాలోకం మొత్తం కదిలి వచ్చింది. దాని తాలూకు వీడియోలతో సోషల్ మీడియాలో సందడి కనిపించింది. ఈ సిరీస్ లో పెద్ద స్టార్లు క్యామియోలు చేశారు. సల్మాన్ ఖాన్, రన్బీర్ కపూర్, రాజమౌళి, అమీర్ ఖాన్ అలా తళుక్కున వచ్చి వెళ్లిపోయే అతిథులుగా బాగానే సందడి చేశారు. ఇదంతా షారుఖ్ కోసమేనని వేరే చెప్పనక్కర్లేదు. కింగ్ షూటింగ్ లో చేయి విరగొట్టుకున్న షారుఖ్ ఇంకా బ్యాండేజ్ తోనే తిరుగుతున్నాడు. కీలకమైన సమయంలో గాయం కావడం ఫ్యాన్స్ కి బాధ కలిగించినా సిరీస్ అయితే రిలీజైపోయింది.

ఇక బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ విషయానికి వస్తే ఆర్యన్ ఖాన్ ఒక దర్శకుడిగా తనలో విషయముందని ఋజువు చేసుకున్నట్టు ఉత్తరాది రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా తొలి అడుగు అందులోనూ సుదీర్ఘమైన వెబ్ సిరీస్ ఫార్మాట్ ని ఎంచుకోవడం వల్ల ల్యాగ్ గా తీసినట్టు అనిపించినా హిందీ పరిశ్రమలో వివిధ కోణాలను చూపించే ప్రయత్నం చేయడం క్రిటిక్స్ తో ఓకే అనిపిస్తోంది. సాధారణ ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించడం కొంచెం కష్టంగానే ఉందట. చివరి ఎపిసోడ్ ని బాగా హ్యాండిల్ చేసిన ఆర్యన్ ఖాన్ దీన్ని సిరీస్ గా కన్నా సినిమాగా మలచి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on September 18, 2025 9:53 pm

Share

Recent Posts

నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం… టిబెట్‌పై చైనా కుట్ర చేసిందా?!

భార‌త పోరుగు దేశం, దేవ‌భూమి నేపాల్‌లో ఒక్క‌సారిగా సంభ‌వించిన జ‌ల ప్ర‌ళ‌యం.. ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఒక్క‌సారిగా ఉప్పొంగిన కోశీ…

34 minutes ago

తక్కువ బడ్జెట్ హనుమాన్… హిట్టు కొట్టేసింది  

మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…

1 hour ago

రవితేజ ఇకపై మరింత జాగ్రత్తగా

వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…

2 hours ago

సందీప్ వంగ ప్రభావం ఆ స్థాయిలో ఉంది

తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

పులివెందుల టికెట్ వదులుకుంటారా జగన్ సార్?

ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే ప్ర‌క‌ట‌నల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. స‌మ‌యం వ‌చ్చింద‌నో.. సంద‌ర్భం చిక్కింద‌నో…

4 hours ago

బ్యాలెట్ పోరుపై వైసీపీ ఆశ‌లు ఫ‌లించేనా…?

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల‌ను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి ఎన్నిక‌ల సంఘం కూడా…

4 hours ago