తెలుగులోంచి గత కొన్నేళ్లలో చాలా సినిమాలు హిందీకి వెళ్లాయి. కానీ మన కథల్ని బాలీవుడ్ రైటర్లు, డైరెక్టర్లు కలగాపులగం చేసేయడం.. ఆయా సినిమాలు లుక్‌నే మార్చేయడం చాలాసార్లు చూశాం. రెడీ, కిక్, వర్షం, క్షణం లాంటి సినిమాలను హిందీలో చూస్తే ఒరిజినల్‌తో చాలా తక్కువ పోలికలు కనిపిస్తాయి. మూల కథను తీసుకుని వేరే ట్రీట్మెంట్ ఇచ్చి సినిమాలు తీయడం బాలీవుడ్ జనాలకు అలవాటు. ఇక్కడ సినిమాలు యథాతథంగా హిందీలోకి వెళ్లిన సందర్భాలు అరుదు.
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లాంటి కొన్ని సినిమాలు ఇందుకు మినహాయింపు. మాతృకతో పోలిస్తే దానికి పెద్దగా తేడా కనిపించదు. కాగా ఇప్పుడు మరో తెలుగు సినిమాను హిందీలో యథాతథంగా దించేశారు. ఆ చిత్రమే.. దుర్గామతి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన హిట్ సినిమా ‘భాగమతి’కి ఇది రీమేక్.
మాతృకను రూపొందించిన అశోకే హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించాడు. ఒరిజినల్‌ను ఎంతమాత్రం మార్చాల్సిన అవసరం లేదని నిర్మాతలు బలంగా ఫిక్సయినట్లున్నారు. అశోక్‌కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి తెలుగు వెర్షన్‌ను యథాతథంగా తీయడానికి ఛాన్స్ ఇచ్చినట్లున్నారు. తాజాగా రిలీజైన ‘దుర్గామతి’ ట్రైలర్ చూస్తే అందులోని ప్రతి విజువల్ కూడా తెలుగులో చూసిందే. కాకపోతే భాగమతి సెట్టింగ్‌లో కొంచెం మార్పులు చేసినట్లున్నారంతే. దాన్ని మినహాయిస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేసినట్లున్నారు.
హిందీలో అనుష్క పాత్రలో చేసిన భూమి పడ్నేకర్.. లీడ్ రోల్‌కు ఎంతమాత్రం సరితూగనట్లు అనిపించింది. అనుష్క ఆహార్యం, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫామెన్స్‌ను ఆమె ఏమాత్రం మ్యాచ్ చేయలేదని ఒరిజినల్ చూసిన వాళ్లందరూ చెప్పేస్తారు. తెలుగులో జయరాం చేసిన విలన్ పాత్రలో అర్షద్ వార్సి ఓకే అనిపించాడు. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా డిసెంబరు 11న విడుదల కాబోతోంది. మరి మన తెలుగు దర్శకుడికి బాలీవుడ్ ఎంట్రీలో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
This post was last modified on November 25, 2020 5:55 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…