ఇప్పటి ట్రెండ్ ఎలా ఉందంటే రీ రిలీజులకు సైతం రెగ్యులర్ టికెట్ రేట్లు పెట్టి దోచేసుకుంటున్నారు. కొందరైతే ఇంకో మెట్టు పైకెక్కి నూటా యాభై రూపాయలు ఉన్న చోట ప్రభుత్వ గరిష్ట పరిమితి ఉంది కదాని రెండు వందల దాకా పెట్టేసి అభిమానుల ఎమోషన్లను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ మధ్య ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఇదో నిత్య కృత్యంగా మారిపోయింది. అందుకే సామాన్య ప్రేక్షకులు మాకొద్దు ఈ పాత సినిమాలంటూ యూట్యూబ్, ఓటిటిలో చూసుకుంటున్నారు. ఇది గుర్తించారు కాబోలు అక్కినేని ఫ్యాన్స్ ఒక మంచి ఆలోచన చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి సెప్టెంబర్ 20 అంటే శనివారం వస్తోంది.
ఈ సందర్భంగా ఏఎన్ఆర్ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ని ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ఉచితంగా ప్రదర్శించబోతున్నారు. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, ఒంగోలు తదితర ప్రాంతాల్లో పైసా ఖర్చు లేకుండా ప్రేమాభిషేకం, డాక్టర్ చక్రవర్తి లాంటి క్లాసిక్స్ ని చూసేయవచ్చు. బుక్ మై షోలో చేసుకున్నా ఎలాంటి రుసుము ఉండదు. లేదా నేరుగా థియేటర్ కు వెళ్లినా ఫ్రీగా కుర్చీలో కూచుని చూసేయడమే. అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యాల్లాంటి సినిమాలవి. ముఖ్యంగా ప్రేమాభిషేకంకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. నలభై సంవత్సరాల పాత సినిమా అయినా సరే పాటలు ఇప్పటికీ వినగానే ఊపేస్తాయి.
ఇలాంటి ప్రదర్శనలు మొదటిసారి కాదు. గతంలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన నటించిన మూడు వందల పైచిలుకు సినిమాలను రోజుకు ఒకటి చొప్పున గుంటూరు పెమ్మసాని థియేటర్ లో ఏడాది పాటు వేశారు. వీటికి మంచి స్పందన వచ్చింది. అయితే అది కేవలం ఒక్క నగరానికి పరిమితం చేశారు. ఇప్పుడు ఏఎన్ఆర్ అభిమానులు పలు చోట్ల స్క్రీనింగ్స్ వేస్తున్నారు. ఒకప్పటి కల్ట్ మూవీస్ ని ఇలా ఉచితంగా చూపించడం వల్ల కొత్త జనరేషన్ వాటి గురించి తెలుసుకునేందుకు ఇష్టపడతారు. అంతే తప్ప ప్రతిదీ బిజినెస్ కోణంలో ఆలోచిస్తే రీ రిలీజ్ ట్రెండ్ అంతరించిపోయే ప్రమాదం దగ్గర్లోనే ఉంది.
This post was last modified on September 18, 2025 3:27 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…