ప్రభాస్ కల్కి 2898 ఏడిలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వద్ధామ పాత్ర ఎంత గొప్పగా పేలిందో చూశాం. అంతకు ముందు ఆయన సైరా లాంటి తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ కల్కిలో చూపించిన ప్రభావం ఇంతకు ముందు కనిపించలేదు. ఈ క్యారెక్టర్ ని ఆయన ఎంతగా ప్రేమించారంటే ప్రమోషన్ల టైంలో పదే పదే సినిమా గురించి చెప్పడం, ట్వీట్లు వేయడం, ఇంటర్వ్యూలలో ప్రత్యేకంగా గుర్తు చేయడం లాంటివి చాలా చేశారు. ఈ కారణంగానే కల్కి నిర్మాత అశ్విని దత్, దర్శకుడు నాగ అశ్విన్, హీరో ప్రభాస్ తో ప్రత్యేక బాండింగ్ ఏర్పడింది. కల్కి 2లో కమల్ హాసన్ తో పాటు ఈయనకూ ప్రాధాన్యం పెరగబోతోంది.
ఇదిలా ఉండగా ప్రభాస్ మరో మూవీ ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) లో ఒక కీలకమైన పాత్ర కోసం అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్ ని దర్శకుడు హను రాఘవపూడి సంప్రదించినట్టు ముంబై టాక్. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ జూనియర్ బిగ్ బి నుంచి సానుకూల సంకేతం వచ్చిందట. సీతా రామంలో సుమంత్ తరహాలో ఈ రోల్ కు చాలా ప్రాధాన్యం ఉంటుందని, ప్రభాస్ ప్రేమకథను మలుపు తిప్పే గుర్తుండిపోయే ఈ వేషంలో ఎన్నో ఆప్షన్లు పరిశీలించిన తర్వాత అభిషేక్ అయితేనే న్యాయం చేయగలరని భావించారట. రెండు వైపులా ఓకే అనుకుంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రావొచ్చు.
ది రాజా సాబ్ జనవరిలో విడుదలయ్యాక నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే కానుంది. కాకపోతే ఎప్పుడనేది ఇంకా ఫైనల్ చేయలేదు. సగానికి పైగా షూట్ పూర్తి చేసిన హను రాఘవపూడి ఈసారి బ్రిటిష్ బ్యాక్ డ్రాప్, స్వాతంత్ర సమరం నేపథ్యంలో ఇంటెన్స్ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేయబోతున్నట్టు సమాచారం. ప్రభాస్ ని గతంలో చూడని ఒక సరికొత్త షేడ్ లో ప్రెజెంట్ చేస్తారని తెలిసింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాని మైత్రి మూవీ మేకర్స్ పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది. 2026 దసరా లేదా దీపావళిని టార్గెట్ గా పెట్టుకుని ఆ మేరకు బాలన్స్ షూట్ ప్లాన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్.
This post was last modified on September 18, 2025 12:19 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…