నిన్న ఏపీ ప్రభుత్వం ఓజి టికెట్ రేట్లు ప్రీమియర్లకు సంబంధించిన జిఓ విడుదల చేయడం ఫ్యాన్స్ లో ఎంతో సంతోషం కొంత అయోమయం లేవనెత్తింది. అర్ధరాత్రి 1 గంటకు వెయ్యి రూపాయల టికెట్ రేట్ ఫిక్స్ చేయడం వరకు హ్యాపీనే. చాలా పెద్ద రికార్డు నమోదవుతుంది. కానీ ఫస్ట్ డే కేవలం అయిదు షోలకు మాత్రమే అనుమతి ఇవ్వడం కన్ఫ్యూజన్ కు దారి తీస్తోంది. ఎందుకంటే స్పెషల్ షో అయ్యాక తర్వాత ఆట పది లేదా పదకొండు మధ్యలో మొదలుపెట్టాలి. ఒకవేళ అంతకన్నా ముందు ఏ ఏడు గంటలకో షో వేస్తే మధ్యాన్నం, లేదా రాత్రి సెకండ్ షోలో ఒకటి ఎగిరిపోతుంది. ఇది పెద్ద దెబ్బ.
పుష్ప 2, దేవరకు ఈ సమస్య రాలేదు. ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా చేశారానే అనుమానం అభిమానుల్లో తలెత్తుతోంది. ఎందుకంటే ఒంటి గంట షో అయ్యాక సుమారు అయిదారు గంటల గ్యాప్ రావడం ఎంత మాత్రం సేఫ్ కాదు. టాక్ రకరకాలుగా పాకిపోతుంది. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా స్పాయిలర్స్ రూపంలో దాన్ని చెడగొట్టే బ్యాచ్ సోషల్ మీడియాలో ఎలాగూ ఉంటుంది. అలా కాకుండా వరసగా షోలు పడితే ఆడియన్స్ కి ఆలోచించుకునే టైం ఉండదు. చకచకా టికెట్లు కొనేసుకుని థియేటర్లకు వెళ్ళిపోతారు. ఏదైనా సవరణతో కొత్త జిఓ రావాలని ఫ్యాన్సే కాదు మూవీ లవర్స్ కూడా కోరుకుంటున్నారు.
ఇప్పటికైతే ఓజికి మొదటి రోజు షోల కథ ఇలా ఉంది. పది రోజుల పాటు భారీ పెంపు ఇవ్వడంతో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మటుకు రాజమౌళి, పుష్ప రికార్డులను ఓజి టచ్ చేయబోతోంది. ఇప్పటిదాకా రికార్డుల పరంగా కొంచెం వెనుకబడి ఉన్న పవన్ ఆ ఆకలిని పూర్తిగా ఓజితో తీరుస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. ముఖ్యంగా ప్రీమియర్ కు వెయ్యి రూపాయలంటేనే లెక్కచేయని అభిమానుల జోష్ చూస్తుంటే రెగ్యులర్ షోలకు టికెట్లు దొరకడం అనుమానంగానే ఉంది. అందరి నమ్మకం సుజిత్ మీదే. ఫ్యాన్ బాయ్ గా తన పవర్ స్టార్ ని ఎలా చూపిస్తాడోననే ఎగ్జైట్ మెంట్ అందరిలోనూ ఉంది. చూడాలి మరి ఏం చేస్తాడో.
This post was last modified on September 18, 2025 11:35 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…