వీటీవీ గణేష్.. తమిళంలో పాపులర్ కమెడియన్. నాలుగేళ్ల ముందు వరకు తన గురించి మన వాళ్లకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు తెలుగులో స్టార్ కమెడియన్లతో సమానంగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సహా అనేక హిట్ సినిమాల్లో వీటీవీ గణేష్ నటించాడు. ఆయనకు తెలుగులో ఇంత డిమాడ్ రావడానికి కారణం బీస్ట్ అనే ఫ్లాప్ మూవీ కావడం విశేషం. ఈ చిత్రంతోనే గణేష్ సోషల్ మీడియాలో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించాడు. మన తెలుగు వాళ్లకు కూడా చేరువ అయిపోయాడు.
తన పేరు కూడా తెలియకుండానే మన వాళ్లు ఆయన్ని మీమ్స్ ద్వారా సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. ఆ చిత్రమే.. బీస్ట్. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు అంటూ ఒక డైలాగ్ చెబుతాడు వీటీవీ గణేష్. అది పాపులర్ మీమ్ అయిపోయింది. మీమ్స్ క్రియేట్ చేయడంలో, వాటిని సందర్భానుసారంగా వాడడంలో, మీమ్ లాంగ్వేజ్‌లో మాట్లాడ్డంలో తెలుగు వాళ్లకు మించిన వాళ్లు ఎవ్వరూ ఉండరు. బీస్ట్ మూవీలో వీటీవీ గణేష్ చెప్పిన ఒక్క డైలాగ్‌తో మీమ్స్ మోత మోగిపోయాయి. ఆ పాపులారిటీతోనే తెలుగులో గణేష్ అవకాశాలు అందుకున్నారు.
తెలుగు వాళ్లు తనను ఎంతగా ఆదరిస్తున్నారనే విషయాన్ని కిస్ అనే తమిళ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో వీటీవీ గణేష్ పంచుకున్నారు. బీస్ట్‌లో ఆ పాపులర్ మీమ్ డైలాగ్‌ను సతీష్ అనే నటుడితో చెబుతాడు గణేష్. అతను కిస్ మూవీలోనూ ఆయనతో కలిసి నటించాడు. సతీష్‌తో తాను చెప్పిన డైలాగ్ తెలుగులో తనకు ఊహించని ఫాలోయింగ్ సంపాదించిందని.. ఇప్పుడు పెద్ద పెద్ద తెలుగు స్టార్లతో కలిసి పదికి పైగా సినిమాలు చేస్తున్నానంటే ఆ డైలాగే కారణమని.. తెలుగు ఆడియన్స్ తనను సొంత వాడిలా చూస్తున్నారని వీటీవీ గణేష్ పేర్కొన్నాడు. ఈ సందర్భఃగా తెలుగు డైరెక్టర్లు ఎంతో ప్యాషనేట్‌గా సినిమాలు తీస్తారని వీటీవీ గణేష్ కొనియాడాడు.
This post was last modified on September 18, 2025 7:41 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…