జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘డ్రాగన్’ ఒకటి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ ఓకే చేసిన సినిమాల్లో ఇదొకటి. పైగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నది కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇది కచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టే సినిమా అవుతుందనే ఆశలతో ఉన్నారు అభిమానులు. ‘వార్-2’ను పూర్తి చేశాక కొన్ని నెలల ముందే ఈ సినిమా షూట్‌లో జాయినయ్యాడు తారక్. రెండు మూడు షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు.
ఐతే ‘డ్రాగన్’ ఔట్ పుట్ విషయమై ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటిదాకా తీసిన సన్నివేశాలు అనుకున్నంత బాగా రాలేదని.. దీంతో రీషూట్లు జరుగుతున్నాయనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ‘వార్-2’ కోసం బరువు తగ్గడంతో తారక్ బలహీనంగా తయారయ్యాడు. ఆ లుక్‌తోనే ‘డ్రాగన్’ షూట్‌కు హాజరు కాగా.. తన మీద తీసిన సీన్లు అనుకున్నంత బాగా రాలేదని అంటున్నారు.
ప్రశాంత్ నీల్ అంటే ఎలివేషన్లకు మారు పేరు. తారక్ లాంటి మాస్ హీరోతో తన మార్కు ఎలివేషన్ సీన్లు పడితే.. ఫైర్ మామూలుగా ఉండదని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ తారక్ లుక్, కొన్ని వేరే కారణాల వల్ల ‘డ్రాగన్’ సీన్స్ అనుకున్నంత బాగా రాలేదని.. దీంతో ఆ సన్నివేశాలు మళ్లీ తీస్తున్నారని సోషల్ మీడియాలో రూమర్లు ఊపందుకున్నాయి.
‘డ్రాగన్’ పేరు పెట్టకుండా సోషల్ మీడియాలో ఒక పెద్ద సినిమాకు రీషూట్స్ జరుగుతున్నాయంటూ పోస్టులు పడుతుండగా.. అందరూ వాటిని ‘డ్రాగన్’కే లింక్ చేస్తున్నారు. తారక్ మళ్లీ లుక్ మీద ఫోకస్ పెట్టారని.. కొన్ని రోజుల్లో ఒకప్పటి అట్రాక్టివ్ లుక్‌లోకి మారుతాడని.. తర్వాత తీసే సీన్లకు ఢోకా ఉండదని అంటున్నారు. రీషూట్ల గురించి రూమర్లు అభిమానులను ఒకింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఔట్ పుట్ బాలేనపుడు సర్దుబాట్లు చేసుకుని మరింత బాగా తీస్తే అది సినిమాకు మంచే చేస్తాయి కాబట్టి వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates