Movie News

‘రాజా సాబ్’లో మోతెక్కిపోయే డ్యాన్స్ నంబర్

‘బాహుబలి’ తర్వాత వరుసగా మూడు ఫెయిల్యూర్లతో అభిమానులను నిరాశపరిచాడు రెబల్ స్టార్ ప్రభాస్. కానీ ‘సలార్’ దగ్గర్నుంచి ప్రభాస్ రాత మారింది. ఆ సినిమా మళ్లీ అభిమానుల్లో జోష్ నింపింది. ఇక గత ఏడాది వచ్చిన ‘కల్కి’ అంచనాలను అందుకుని ఇంకా పెద్ద హిట్టయింది. దీంతో రెబల్ ఫ్యాన్స్‌ ఆనందం అంతా ఇంతా కాదు. ప్రభాస్ తర్వాతి చిత్రాల లైనప్ కూడా క్రేజీగా కనిపిస్తోంది.

రెబల్ స్టార్ నెక్స్ట్ రిలీజ్ ‘రాజా సాబ్’ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్లాపుల్లో ఉన్న మారుతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రభాస్ మొదలుపెట్టినపుడు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఆ నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయేలా కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

‘రాజా సాబ్’ గురించి టీంలో ఎవ్వరు మాట్లాడినా.. చాలా గొప్పగా చెబుతున్నారు. మారుతి కూడా సందర్భం వచ్చినపుడల్లా సినిమా ఒక రేంజిలో ఉంటుందనే అంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మారుతి.. ఈ సినిమాలోని ఒక డ్యాన్స్ నంబర్ గురించి మాట్లాడాడు. ప్రభాస్ నుంచి మామూలుగా అభిమానులు పెద్దగా డ్యాన్సులు ఆశించారు. అతను నృత్యాల మీద దృష్టిపెట్టడం తక్కువ. ముఖ్యంగా ‘బాహుబలి’ నుంచి తన సినిమాల్లో డ్యాన్సులకు స్కోపే ఉండట్లేదు. తన కథల్లో భారీతనం, స్పాన్ పెరిగిపోయి డ్యాన్స్ నంబర్స్‌ పెట్టే అవకాశమే ఉండట్లేదు. 

కానీ ‘రాజా సాబ్’లో మాత్రం ప్రభాస్ అదిరిపోయే డ్యాన్సులు వేసినట్లు సంకేతాలు ఇచ్చాడు మారుతి. ఇందులో ఒక పాట కోసం టాప్ కొరియాగ్రాఫర్లలో ఒకడైన ప్రేమ్ రక్షిత్‌ను ఎంచుకున్నట్లు మారుతి తెలిపాడు. ప్రభాస్‌ను ఎంత బాగా చూపించాలనే విషయంలో లక్ష మంది అభిమానుల ఆకలి తన ఒక్కడికే ఉందని.. అందుకే బిజీగా ఉన్నప్పటికీ ఏరి కోరి రక్షిత్‌ను తీసుకున్నానని.. తన కొరియోగ్రఫీలో ప్రభాస్ అదిరిపోయే డ్యాన్సులు వేశాడని మారుతి తెలిపాడు. ఈ పాటనే ‘రాజా సాబ్’ నుంచి ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on September 17, 2025 1:00 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

43 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

51 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago