యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కెరీర్ మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు అంచనా వేసిన సినిమా.. లైగర్. ఇస్మార్ట్ శంకర్‌తో హిట్టు కొట్టిన పూరి జగన్నాథ్‌తో విజయ్ జట్టు కట్టడంతో ఈ సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో మొదట్నుంచే ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయింది. మేకింగ్ మధ్యలో ఉండగా.. ఈ ప్రాజెక్టులోకి లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ రావడంతో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక తెలుగు సినిమాలో టైసన్ నటించడమేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఆయన పాత్ర గురించి ఎంతో ఊహించుఉన్నారు. తీరా చూస్తే లైగర్‌లో టైసన్ పాత్ర తుస్సుమనిపించింది. కొన్నినిమిషాల నిడివి కోసం పాతిక కోట్లు పుచ్చుకున్న టైసన్.. సినిమాకు ఏమాత్రం వాల్యూ అడిషన్ కాలేకపోయాడు.
ఈ క్యారెక్టర్ విషయంలో తీవ్ర విమర్శలు తప్పలేదు. ఇలాంటి ప్రయోగం విజయ్ ఇక మళ్లీ చేయడు అనుకున్నారంతా. కానీ మళ్లీ విజయ్ సినిమాలో ఇలాంటి కాస్టింగే జరిగినట్లు సమాచారం. కానీ విజయ్ కొత్త చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లూను నటింపజేస్తున్న విషయం ఖరారైంది. ఆర్నాల్డ్ ఓస్లూ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. హలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్లలో ఒకటైన మమ్మీ సినిమాలో విలన్‌గా నటించిన ఆర్టిస్ట్ అంటే ఈజీగా గుర్తుపడతారు. ఆ సినిమాకు ఆర్నాల్డ్‌కు వరల్డ్ వైడ్ మామూలు గుర్తింపు రాలేదు.
తర్వాత అతను మరెన్నో సినిమాల్లో నటించినా.. మమ్మీతో వచ్చిన ఫేమే వేరు. ఈ నటుడిని విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు విలన్‌గా తీసుకుంటున్నట్లు కొన్ని నెలల ముందే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తే నిజమైంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ కోసం ఆర్నాల్డ్‌ను తీసుకున్నారు. మరి ఒక హాలీవుడ్ నటుడిని తీసుకుంటున్నారంటే సినిమాలో విదేశీ నేపథ్యం ఏదో ఉంటుందని భావిస్తున్నారు. విజయ్ విజయాల్లో లేకపోయినా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ లుక్ మార్చేశాడు. ఇది కొన్ని వందల ఏళ్ల కిందటి కథతో సాగుతుందని సమాచారం.
This post was last modified on September 17, 2025 7:45 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…