వెబ్ సిరీస్‌ల విషయంలో మన స్టార్ హీరోలు, దర్శకులకు చిన్న చూపు ఉన్నట్లే అనిపిస్తోంది వాళ్ల వ్యవహారం చూస్తుంటే. మన దగ్గర ఫామ్‌లో ఉన్న, పేరున్న నటీనటులు.. టెక్నీషియన్లు పెద్దగా వెబ్ సిరీస్‌ల వైపు చూస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. హిందీలో పేరున్న నటీనటులు, దర్శకులు వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఇక హాలీవుడ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. కానీ తెలుగులో మాత్రం క్రిష్ జాగర్లమూడి, సత్యదేవ్ లాంటి వాళ్లు తప్పితే పేరున్న వాళ్లు ఇటు వైపు చూడట్లేదు.
ఐతే అగ్ర దర్శకుడు సుకుమార్ ఈ ఒరవడి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయొచ్చని అంటున్నారు. అది ఆయన కొత్త సినిమా ‘పుష్ప’కు రిలేటెడ్‌గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా కథ తయారీలో భాగంగా సుకుమార్ అండ్ టీం ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఎంతగానో పరిశోధించింది.
లెక్కలేనంత సమాచారం రాబట్టింది. ఎన్నో ఉపకథలు తయారు చేసింది. అందులోంచి సినిమాకు తీసుకున్న కంటెంట్ తక్కువే. మిగతా సమాచారంతో వెబ్ సిరీస్ చేద్దామన్న ఆలోచన ఇంతకముందే వచ్చింది.
తర్వాత ‘పుష్ప’కు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా నడిచింది. దీనిపై సుకుమార్ పరిపరి విధాల ఆలోచించారని.. చివరికిప్పుడు వెబ్ సిరీస్‌కే ఓటేశారని సన్నిహితుల సమాచారం.
అమేజాన్ ప్రైం వాళ్లతో దీనిపై డిస్కషన్లు నడుస్తున్నాయట. రామ్ చరణ్ బందువొకరు అమేజాన్ సంస్థలో కీలక బాధ్యతలు పోషిస్తున్నారని.. ఆయన వాళ్లతో మాట్లాడి బడ్జెట్, ఇతర వ్యవహారాల్ని ఫైనలైజ్ చేస్తున్నారని.. చరణ్ కూడా భాగస్వామిగా మారి ఈ వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందని.. సుకుమార్ డైరెక్ట్ చేయడం లేదా తన అసిస్టెంటును పెట్టి సూపర్ వైజ్ చేయడం.. రెంటిలో ఏదో ఒకటి జరగొచ్చని.. పుష్ప పట్టాలెక్కిన తర్వాత దీనిపై స్పష్ట రావచ్చని అంటున్నారు.
This post was last modified on May 2, 2020 12:36 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…