అనుష్క కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ లో సరికొత్త రికార్డులు సృష్టించిన మూవీగా అరుంధతి ఎప్పటికీ మర్చిపోలేని హారర్ క్లాసిక్. దీని స్ఫూర్తితో తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. ఇటీవలే వచ్చిన కిష్కిందపురిలోనూ దీని రెఫరెన్సులు గమనించవచ్చు. అంత ఐకానిక్ గా నిలిచిన అరుంధతిని ఇతర భాషల్లో రీమేక్ చేశారు కానీ బాలీవుడ్ లో మాత్రం జరగలేదు. ఒకదశలో దీపికా పదుకునేతో అనుకుని ప్రతిపాదన దగ్గర ఆపేశారు. సోనాక్షితో భాగమతి రీమేక్ దారుణంగా ఫెయిలయ్యాక మళ్ళీ ఎవరూ అరుంధతి ఆలోచన చేయలేదు.
ఇన్నేళ్ల తర్వాతమరోసారి ఆ ప్రపోజల్ తెరముందుకొచ్చిందట. చిరంజీవితో గాడ్ ఫాదర్ తీసిన దర్శకుడు మోహన్ రాజా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు చెన్నై టాక్. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ తో కలిసి హిందీ తెరంగేట్రం చేస్తున్న శ్రీలీల పేరుని పరిశీలిస్తున్నారట. నిజానికి అనుష్కని మ్యాచ్ చేయడం అంత సులభం కాదు. పైగా అరుంధతిని భాషతో సంబంధం లేకుండా డబ్బింగుల రూపంలో అందరూ చూసేశారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీయాలనుకోవడం సాహసమే కాదు రిస్క్ కూడా. మరి మోహన్ రాజాకు ఎందుకు ఆలోచన వచ్చిందో, లేక ఇది కేవలం పుకారు దశలోనే ఉందో వేచి చూస్తే కానీ క్లారిటీ రాదు.
గాడ్ ఫాదర్ తర్వాత మోహన్ రాజాకు గ్యాప్ వచ్చేసింది. తని ఒరువన్ 2 (ధృవ ఒరిజినల్ వెర్షన్) తీయాలనుకుని చివరి నిమిషంలో బ్రేక్ వేశారు. నాగార్జున వందో సినిమా చేయి దాక వచ్చి మిస్సయ్యింది. దాంతో ఈయన కథలు రాసుకునే పనిలో పడ్డారు. రీమేకుల స్పెషలిస్ట్ గా పేరున్న మోహన్ రాజా కెరీర్ లో ఎక్కువ శాతం హిట్లు వాటి వల్ల వచ్చినవే. తెలుగులో మొదటి సినిమా హనుమాన్ జంక్షన్ సైతం అరువు తెచ్చుకున్నదే. అయినా ఎప్పుడో ఆడేసి వెళ్ళిపోయిన అరుంధతి లాంటి వాటిని రీమేక్ చేయాలనుకోవడం కన్నా సైలెంట్ గా ఉండటం ఉత్తమేమేమో. చెన్నై వర్గాలు మాత్రం గాసిప్పే అంటున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates