విడుదలకు ముందు ప్రతి ఒక్కరూ తమ సినిమా గురించి గొప్పగా మాట్లాడేవాళ్లే. ఐతే ఆ మాటలకు, సినిమాలో ఉన్న కంటెంట్‌కు అన్నిసార్లూ పొంతన కుదరదు. అంచనాల కంటే తక్కువ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన కొత్త చిత్రం కిష్కింధపురి మీద ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ చూపించాడు. రాక్షసుడు ను మించిన సినిమా అని.. కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని.. కిష్కింధపురి-2 కోసం ప్రేక్షకులు అడుగుతారని విడుదలకు ముందు అతను వ్యాఖ్యానించాడు. నిర్మాత కూడా ఎంతో నమ్మకంగా పెయిడ్ ప్రిమియర్స్ కూడా పెద్ద సంఖ్యలో వేశారు. అప్పుడు టాక్ బాగానే వచ్చింది.
ఐతే తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన రివ్యూలు మాత్రం రాలేదు. చాలా వరకు యావరేజ్ రివ్యూలు, రేటింగ్‌లతో సరిపెట్టారు క్రిటిక్స్. టాక్ కూడా కొంచెం మిక్స్‌డ్ గా వచ్చింది. దీనికి తోడు పోటీగా వచ్చిన మిరాయ్‌కి అదిరిపోయే రివ్యూలు, టాక్ రావడంతో తొలి రోజు కిష్కింధపురి పెద్దగా డిస్కషన్లలో లేదు.
ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర కిష్కింధపురి ఏమాత్రం నిలబడుతుందో అన్న సందేహాలు కలిగాయి. కానీ రివ్యూలను, డివైడ్ టాక్‌ను జయిస్తూ ఈ సినిమా రెండో రోజు మంచి ఆక్యుపెన్సీలతో రన్ అయింది. హైదరాబాద్ సహా పెద్ద సిటీల్లో పెద్ద ఎత్తున హౌస్ ఫుల్స్ పడ్డాయి. బి, సి సెంటర్లలో బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఉన్న ఫాలోయింగ్ సినిమాకు ప్లస్ అయింది. మిరాయ్ పోటీని తట్టుకుని ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఆదివారం కూడా సినిమా అంచనాలను మించి పెర్ఫామ్ చేసింది.
వీకెండ్లో కిష్కింధపురికి రూ.12కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. సోమవారం ఆక్యుపెన్సీలు తగ్గినా.. డ్రాప్ మరీ ఎక్కువ అయితే లేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్‌ఫుల్‌గా నిలబడిందనడంలో సందేహం లేదు. ఈ సినిమాను రూ.32 కోట్ల బడ్జెట్లో రూపొందించారు. బెల్లంకొండ శ్రీనివాస్‌కు హిందీలో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా డిజిటల రైట్స్ రూపంలోనే 80 శాతం మేర పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. థియేట్రికల్ హక్కులను రూ.10 కోట్ల లోపే అమ్మారు. సినిమా బ్రేక్ ఈవెన్ కావడం, లాభాలు అందించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి కిష్కింధపురిపై బెల్లంకొండ పెట్టుకున్న నమ్మకం నిలబడిందనే చెప్పాలి.
This post was last modified on September 15, 2025 10:29 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…