థియేటర్లు తెరుచుకోమని పర్మిషన్ ఏనాడో వచ్చేసినా కానీ థియేటర్లకు జనం రారనే భయంతో నిర్మాతలు ఇంకా ఓటిటి ప్లాట్‍ఫామ్‍లనే నమ్ముకుంటున్నారు. బడా హీరోల సినిమాలు కూడా విడుదల కాకుండా వాయిదా పడుతూనే వున్నాయి. ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే తప్ప పరిస్థితిని అంచనా వేయలేమని భావిస్తోంటే ముందుగా ఆ ధైర్యం చేసే వాళ్లే ఎవరూ కనిపించడం లేదు. హీరోలే వెనకాడుతోన్న టైమ్‍లో హీరోయిన్ ప్రధాన సినిమా ఒకటి థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇందు కీ జవానీ’ చిత్రాన్ని డిసెంబరు 11న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
విశేషం ఏమిటంటే అదే రోజున అమెజాన్‍లో దుర్గామతి అనే మరో హీరోయిన్ ప్రధాన సినిమా విడుదలవుతోంది. తెలుగులో అనుష్క నటించిన భాగమతికి రీమేక్ అయిన ఈ చిత్రంలో భూమి పేడ్నేకర్ హీరోయిన్‍గా నటించింది. మరి కియారా చిత్రం చూడ్డానికి ప్రేక్షకులు ఏ స్థాయిలో తరలి వస్తారనేది తెలియదు. యాభై శాతం సీట్లు అమ్మకంతో బిజినెస్ ఎలా జరుగుతుందనేది తెలుసుకోవడానికి ఈ చిత్రం కొంతవరకు ఉపకరిస్తుంది.
This post was last modified on November 24, 2020 8:00 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…