Movie News

బార్బరిక్ దర్శకుడికి వందసార్లు చెప్పా-మారుతి

గత నెలలో విడుదలైన ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే చిన్న సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు రావడం లేదని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో అందరినీ కదిలించేసింది. చూసిన వాళ్లందరూ మంచి సినిమా అంటున్నా.. జనం వచ్చి థియేటర్లలో సినిమా చూడట్లేదని అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అంతే కాక ఈ సినిమా బాలేదని అంటే చెప్పుతో కొట్టుకుంటా అని తాను విడుదలకు ముందు ఛాలెంజ్ చేశానని.. ఆ ప్రకారమే చేస్తున్నానంటూ నిజంగానే చెప్పుతో కొట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఐతే ఈ వీడియో వైరల్ అయ్యాక తాను చేసింది తప్పు అంటూ ఆ దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఈ ఉదంతంపై ‘బార్బరిక్’ ప్రెజెంటర్ అయిన స్టార్ డైరెక్టర్ మారుతి స్పందించాడు.

‘త్రిబాణధారి బార్బరిక్’ మంచి సినిమా అయినా.. అది జనాలకు రీచ్ కాకపోవడానికి టైటిల్ ఒక కారణమని మారుతి అభిప్రాయపడ్డాడు. ‘బార్బరిక్’ అనేే టైటిల్ ఏదో ‘బార్బిక్యూ’లా ఉందని.. ఆ టైటిల్ వద్దని తాను మోహన్‌కు వందసార్లు చెప్పానని మారుతి తెలిపాడు. ఈ టైటిల్ వద్దంటూ రోజుకో పేరు సూచిస్తూ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టేవాడినన్నాడు మారుతి. జస్ట్ టైటిల్ చూస్తే మనసు మారదేమో అని.. వాటిని డిజైన్ చేసి కూడా పంపేవాడినన్నాడు. ఐతే ఆ దర్శకుడు మాత్రం ‘బార్బరిక్’ అంటే దేవుడు.. దానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు అని ఒక ట్రాన్స్‌లో ఉండిపోయాడని.. ఎంత చెప్పినా వినలేదని మారుతి తెలిపాడు.

ఒక దర్శకుడిగా తాను మరో దర్శకుడిని ఫోర్స్ చేయకూడదని ఒక దశ దాటాక వదిలేశానని.. కానీ ఆ సినిమా జనాలకు రీచ్ కాకుండానే వెళ్లిపోయిందని మారుతి అన్నాడు. మోహన్ మంచి దర్శకుడని, అతను మంచి సినిమానే తీశాడని.. కానీ ఆ సినిమా టైటిల్ సహా కొన్ని కారణాలతో జనాల్లోకి వెళ్లలేదని మారుతి అభిప్రాయపడ్డాడు.

This post was last modified on September 14, 2025 4:33 pm

Share

Recent Posts

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

24 minutes ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

54 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

6 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago