ఒకప్పుడు ఆర్టిస్టులకు పారితోషకాలు ఇవ్వడం.. వారికి వసతి, తిండి లాంటి అవసరాలు తీర్చడం వరకే నిర్మాతల బాధ్యతగా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. హీరో హీరోయిన్లు, పెద్ద ఆర్టిస్టులకు భారీ పారితోషకాలు ఇస్తూ.. అవి చాలవన్నట్లు వారి స్టాఫ్‌ను మెయింటైన్ చేయడం, కారవాన్లకు బిల్లులు చెల్లించడం, ఇలా అదనపు ఖర్చులు నిర్మాతల మీద పడుతున్నాయి. స్టాఫ్ అంటే ఒకరిద్దరు కూడా కాదు. డ్రైవర్లు, అసిస్టెంట్లు, బౌన్సర్లు.. ఇలా చాలామందికి నిర్మాతలు రోజు వారీ బిల్లులు చెల్లించక తప్పని పరిస్థితి. వీళ్లందరికీ ఫ్లైట్ టికెట్లు, వసతి కూడా వారి బాధ్యతగానే ఉంటోంది. సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడానికి ఇది ఓ ముఖ్య కారణం అనడంలో సందేహం లేదు.
మేకింగ్ మీద పెట్టే బడ్జెట్ తగ్గిపోయి ఈ రకమైన ఖర్చులకే చాలా వరకు డబ్బు పెట్టాల్సి రావడంతో నిర్మాతలు సతమతం అయిపోతున్నారు. ఈ పరిణామంపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘‘స్టార్లు తమ నటనతో గుర్తింపు సంపాదించాలి. కానీ నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ద్వారా కాదు. నాకు ఒక విషయం అస్సలు అంతుబట్టట్లేదు. ఈ రోజుల్లో స్టార్ హీరోలు ఎవ్వరూ తమ డ్రైవర్లకు డబ్బులు ఇవ్వరట. వారికి నిర్మాతలే పేమెంట్లు చేయాలట. ఒక నటుడి స్పాట్ బాయ్‌కి కూడా నిర్మాతే డబ్బులు చెల్లిస్తున్నాడు. ఇది అంతటితో ఆగిపోవట్లేదు.
నటుల ట్రైనర్లు, వంట వాళ్లు, ఇతర సిబ్బందికి కూడా నిర్మాతలే డబ్బులిస్తున్నాడు. కొందరు ఆర్టిస్టులు సెట్లో లైవ్ కిచెన్ పెట్టుకుంటున్నారు. దానికయ్యే ఖర్చు మొత్తం నిర్మాతే చెల్లించాలి. ఒక ఆర్టిస్టు తనతో పాటు స్టాఫ్ కోసం ఒకటికి మించి వానిటీ వాన్లు డిమాండ్ చేస్తున్నాడు. ఒక నిర్మాత సినిమాకు ఏం అవసరమో దానికి మాత్రమే ఖర్చు చేయాలి. మేకప్, హేర్ స్టైలింగ్, కాస్ట్యూమ్ వంటి వాటికి డబ్బులు పెట్టడంలో అర్థముంది. కానీ నటుల వ్యక్తిగత స్టాఫ్‌కు అతనెందుకు డబ్బులివ్వాలి. వాళ్లు సినిమాకు ఏ రకంగా సాయపడతారు. కోట్ల రూపాయల పారితోషకాలు తీసుకుంటున్న ఆర్టిస్టులు తమ స్టాఫ్‌కు డబ్బులివ్వలేరా. నేనైతే తొలి రోజు నుంచి నా డ్రైవర్ సహా పర్సనల్ స్టాఫ్ ఎవ్వరికీ నిర్మాతల డబ్బుల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’’ అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు.
This post was last modified on September 14, 2025 1:44 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…