బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్న మిరాయ్ తో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. గత ఏడాది రవితేజ ఈగల్ తో ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ తన మీద నమ్మకంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకున్నాడు. డైరెక్టర్ గా తన డెబ్యూ సూర్య వర్సెస్ సూర్య అనే విషయం సగటు ప్రేక్షకులకు చాలా మందికి తెలియదు. దాని తర్వాత ఎక్కువగా కెమెరామెన్ గా ఫోకస్ చేయడంతో ప్రేమమ్, చిత్రలహరి, ధమాకా, కార్తికేయ 2 లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లలో తన కెమెరాతో భాగం అయ్యాడు. ఇప్పుడు ఛాయాగ్రాహకుడిగా మరో క్రేజీ ప్రాజెక్టు దక్కనుందట.
వాల్తేరు వీరయ్య కాంబోని రిపీట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య చిరు పుట్టినరోజుకి కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి వదిలారు. అక్టోబర్ 2 నుంచి ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి కెమరామెన్ గా కార్తీక్ ఘట్టమనేనిని దాదాపుగా లాక్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఇంకా కథ వినలేదని, చిరంజీవితో చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ చెప్పడం చూస్తే బాబీ ఈ కలయికని సాధ్యం చేసేలానే ఉన్నాడు. మిరాయ్ విజయానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం బహుశా దానికి సంకేతం అనుకోవచ్చు. ఇంకో వారంలో దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.
మిరాయ్ 2కి ఇంకా టైం పట్టేలా ఉంది. పీపుల్స్ మీడియాలోనే జాంబీ రెడ్డి 2 చేస్తున్న తేజ సజ్జ అదయ్యాక 2027లో మిరాయ్ రెండో భాగంలో జాయిన్ కావొచ్చు. అప్పటిదాకా కార్తీక్ ఘట్టమేనేని స్క్రిప్ట్ తో పాటు చిరు బాబీ మూవీని కూడా పూర్తి చేసేయొచ్చు. ఒక ఛాయాగ్రాహకుడు ప్యాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా ఇంత పెద్ద విజయం సాధించడం అరుదు. గతంలో కొందరు ఈ ప్రయత్నాలు చేశారు కానీ బ్లాక్ బస్టర్ దక్కిన వాళ్ళు తక్కువ. కార్తీక్ ఈ విషయంలో ఘనత సాధించాడు. మిరాయ్ సీక్వెల్ కాకుండా మరో సినిమా కూడా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తోనే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on September 14, 2025 12:19 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…