రెండు నెలల కిందట కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏ సినిమాకైనా సరే.. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.200కు మించకూడదంటూ జీవో ఇచ్చింది. దక్షిణాదిన టికెట్ల ధరలు అధికంగా ఉండే నగరాల్లో బెంగళూరు ఒకటి. అక్కడ మల్టీప్లెక్సుల్లో ఫ్లెక్సీ ప్రైసింగ్ అమల్లో ఉండేది. అంటే డిమాండును బట్టి ఎంతైనా రేటు పెంచుకుంటారన్నమాట. ఈ ప్రకారం కొన్ని సినిమాలకు రూ.800 నుంచి 1000 వరకు కూడా రేటు పెట్టేవాళ్లు. మల్టీప్లెక్సుల్లో క్రేజున్న పెద్ద సినిమాలకు 400 మించి రేటు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది.
ఐతే దీని మీద జనం నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం రూ.200 క్యాప్ పెడుతూ జీవో ఇచ్చింది. ఐతే అది వెంటనే అమల్లోకి రాలేదు. తాజాగా నిర్ణయం కార్యరూపం దాల్చింది. ఐతే ట్యాక్సులతో కలిపి అక్కడ మల్టీప్లెక్స్‌లో గరిష్ట రేటు రూ.236గా మారింది. సింగిల్ స్క్రీన్లయినా, మల్టీప్లెక్సులైనా బెంగళూరులో ఇక ఏ సినిమాకు రేటు రూ.236కు మించదు. రిక్లైనర్స్ సీట్లు అయినా దీనికి మించి రేటు పెట్టడానికి వీల్లేదు. అలా అని పూర్తిగా అన్ని మల్టీప్లెక్సులూ దీని పరిధిలోకి వస్తాయా అంటే అలా ఏం కాదు.
75 అంతకంటే తక్కువ సీటింగ్ సామర్థ్యంతో మల్టీప్లెక్సుల్లో కొన్ని ప్రీమియం స్క్రీన్లు ఉంటాయి. వాటిని ఈ రేట్ క్యాప్ నుంచి మినహాయించారు. వాటి రేటు థియేటర్ల ఇష్టం. ఐతే అలాంటి స్క్రీన్లు మరీ ఎక్కువ ఉండవు. కాబట్టి సామాన్య ప్రేక్షకులపై భారం పడనట్లే. లగ్జరీ కావాలనుకున్న వాళ్లు ఎక్కువ రేట్లు పెట్టి వెళ్తారు. ఈ నిర్ణయం కన్నడ చిత్రాల మీదే కాక వివిధ భాషల సినిమాల మీద ప్రభావం చూపనుంది. బెంగళూరులో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి తెలుగు సినిమాల బిజినెస్‌లో కొంత మార్పులు జరగొచ్చు. రేట్ క్యాప్ పెంచడం వల్ల ఒక్కో టికెట్ మీద వచ్చే ఆదాయం తగ్గినా.. ఆక్యుపెన్సీలు పెరిగి బ్యాలెన్స్ జరుగుతుందనే అభిప్రాయాలున్నాయి.
This post was last modified on September 13, 2025 5:28 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…