ఈ ఏడాదిలోనే అత్యధిక రెవిన్యూ రాబట్టే నెలగా ఆగస్ట్ మీద డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బోలెడు నమ్మకం పెట్టుకున్నారు. కానీ దాన్ని వమ్ము చేస్తూ వార్ 2, కూలీ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. రికార్డు నెంబర్లతో బాక్సాఫీస్ షేక్ అవుతుందనుకుంటే రివర్స్ లో బయ్యర్ల హృదయాలు బ్రేక్ అయ్యాయి. ఉన్నంతలో కూలి కాస్త మెరుగనిపించినా దాని మీద పెట్టిన పెట్టుబడి యాంగిల్ లో చూసుకుంటే లాస్ వెంచర్ గానే నిలిచింది. యావరేజ్ టాక్ వచ్చిన సుందకాండ లాంటి చిన్న సినిమా సైతం రికవరీ చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆగస్ట్ ఒక రకమైన ఫియర్ తెచ్చి పెట్టింది.
ఇప్పుడు సెప్టెంబర్ రూపంలో టాలీవుడ్ కు ఆక్సీజెన్ అందుతోంది. లిటిల్ హర్డ్స్ తో మొదలైన బోణీ మిరాయ్, కిష్కిందపురిలతో కొనసాగేలా ఉండటం పట్ల మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఘాటి, మదరాసి నిరాశ పరిచినప్పటికీ కేవలం వారం గ్యాప్ లో థియేటర్లకు జనాలను తీసుకొచ్చే సినిమాలు రావడంతో హాళ్లు కళకళలాడుతున్నాయి. ఆగస్ట్ చివరి వారంలో వచ్చిన కొత్త లోక చాప్టర్ వన్ సైతం ఈ నెల ఖాతాలోనే కలెక్షన్లు తెచ్చింది. జపాన్ మూవీ డెమోన్ స్లేయర్ కు ఊహించని స్థాయిలో స్పందన రావడం కిక్కుని రెట్టింపు చేసే విషయం. శని ఆదివారాలు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో అధిక శాతం నిండుగా ఉన్నాయి.
ఈ ఆనందం ఆస్వాదిస్తుండగానే సెప్టెంబర్ 25 ఓజి వచ్చేస్తుంది. అది చేయబోయే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అసలు పవన్ హరిహర వీరమల్లు అనే డిజాస్టర్ చేయలేదేమో అనిపించేలా ఓజికి హంగామాకు అభిమానులు రెడీ అవుతున్నారు. అర్ధరాత్రి నుంచి షోలు వేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. తెలంగాణలో అనుమతుల కోసం నిర్మాతలు ట్రై చేస్తున్నారు. పుష్ప తరహాలో ముందు రోజు రాత్రే ప్రీమియం ధరలకు టికెట్లు పెట్టినా సోల్డ్ అవుట్ కావడం ఖాయం. ఫియర్ సృష్టించిన ఆగస్ట్ ని మర్చిపోయేలా సెప్టెంబర్ నెల పరిశ్రమకు బేఫికర్ ఫీలింగ్ ఇచ్చేసింది. ఇదే కొనసాగాలి.
This post was last modified on September 13, 2025 6:22 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…