నిర్మాతల కొడుకుల్లో చాలామంది హీరోలవుతుంటారు తప్ప.. ప్రొడక్షన్ కంటిన్యూ చేయడం తక్కువ. టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్లలో ఒకడైన రాజేంద్ర ప్రసాద్ తనయుడైన జగపతిబాబు కూడా ఆ దారినే ఎంచుకున్నాడు. ఆయన హీరోగా ఎదిగే క్రమంలో తండ్రి నిర్మించిన సినిమాల్లో నటించాడు తప్ప.. సొంతంగా మాత్రం ప్రొడక్షన్ చేయలేదు. తన మనస్తత్వానికి నిర్మాణం సరిపోదనే అనేవారు జగపతి.
హీరో వేషాలకు స్వస్తి చెప్పి విలన్, క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలుపెట్టాక కూడా ఆయన నిర్మాణం జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు జగపతిబాబు నిర్మాత అవతారం ఎత్తబోతున్నారు. ఆయన్ని ఒక యువ దర్శకుడు ఆ దిశగా ఇన్‌స్పైర్ చేశాడు. అతనే.. సాయి మార్తాండ్. ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు.. జగపతిబాబు ప్రొడక్షన్లో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మార్తాండే స్వయంగా వెల్లడించాడు.
‘లిటిల్ హార్ట్స్’లో రాజీవ్ కనకాల చేసిన హిలేరియస్ ఫాదర్ క్యారెక్టర్‌ను జగపతిబాబుతోనే చేయించాలనుకున్నాడట సాయి మార్తాండ్. ముందు కథ చెప్పింది కూడా ఆయనకేనట. కానీ ఏవో కారణాల వల్ల జగపతిబాబు ఈ సినిమా చేయలేకపోయారట. కానీ సాయి మార్తాండ్ నరేషన్ నచ్చి.. ఆ పాత్ర చేయలేకపోయానే అనే గిల్ట్ వెంటాడి.. తనతో వేరే సినిమ ా చేస్తానని, ఆ చిత్రాన్ని తనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడట జగపతిబాబు.
‘లిటిల్ హార్ట్స్’ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా తనకు జగపతిబాబు ఫోన్ చేసి.. తనకు పదే పదే ‘లిటిల్ హార్ట్స్’ కథ, అందులో తనతో చేయించాలనుకున్న పాత్ర గుర్తుకు వస్తున్నాయని చెప్పి.. తన ప్రొడక్షన్లో సినిమా చేయమని చెప్పారని.. తాను ఓకే చెప్పానని మార్తాండ్ వెల్లడించాడు. ప్రస్తుతానికి తనకున్న కమిట్మెంట్ ఆ సినిమానే అని సాయి మార్తాండ్ తెలిపాడు. అసలు ప్రొడక్షనే వద్దనుకున్న సీనియర్ నటుడితే.. కెరీర్లో ఈ దశలో సినిమా నిర్మించడానికి రెడీ అయ్యేలా చేయడమంటే చిన్న విషయం కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates