Movie News

వైబ్ ఉంది… పాట లేదు

ఈ మధ్య సినిమా ఫ్లోకి అడ్డం వస్తుందంటే ఏదైనా మంచి పాట తీసేయడానికి దర్శక నిర్మాతలు వెనుకాడటం లేదు. అది లక్షలు కోట్ల ఖర్చుతో తీసిన సాంగ్ అయినా సరే. తాజాగా విడుదలైన మిరాయ్ లో ‘వైబ్ ఉందిలే పిల్లా వైబ్ ఉందిలే’ పాట థియేటర్లలో రాలేదు. రెండు గంటల యాభై నిమిషాల నిడివిలో ఇది లేకపోవడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. మొదలయ్యాక ఎక్కడో ఒక చోట వస్తుంది లెమ్మని ఎదురు చూసే కొద్దీ క్లైమాక్స్ వచ్చేసింది కానీ తేజ సజ్జ, రితిక వర్మ స్టెప్పులు మాత్రం దర్శనమివ్వలేదు. ఆ మధ్య కింగ్డమ్ లోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడిన సంగతి గుర్తే. అసలిలా ఎందుకు జరిగిందో చూద్దాం.

టైటిల్ కార్డు నుంచి చివరి ఘట్టం దాకా మిరాయ్ ఒక పద్ధతి ప్రకారం డివోషన్, యాక్షన్ మిక్స్ చేసుకుంటూ వెళ్ళింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని బలవంతంగా హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ని ఇరికించే ప్రయత్నం చేయలేదు  ఆ స్కోప్ ఉన్నా అనవసరంగా లెన్త్ పెరుగుతుందని భావించి రెగ్యులర్ ఫార్ములా జోలికి వెళ్ళలేదు. అసలు తేజ, రితిక మధ్య లవ్ కెమిస్ట్రీ చూపించనప్పుడు ఇక సాంగ్ ప్రస్తావన ఎందుకు వస్తుంది. అందులోనూ ఒకవేళ పెట్టినా మంచి సీరియస్ టోన్ లో సాగుతున్న కంటెంట్ లో స్పీడ్ బ్రేకర్ లా పాట అనిపిస్తుందే తప్ప ఇంకో ఫీలింగ్ రాదు. అందుకే నిడివి కోసం కట్ చేయడం సబబే.

కొద్దిరోజులు అయ్యాక మళ్ళీ జత చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ దేవరలో దావూదిని రెండు వారాల తర్వాత కలిపారు. అప్పటికే ఆడియన్స్ భారీ సంఖ్యలో సినిమాని చూసేసి ఉండటంతో పెద్దగా ఇబ్బంది కలగలేదు. మిరాయ్ కి కూడా అలా చేస్తారేమో చూడాలి. ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి నిర్ణయం. మూస సూత్రాలకు కట్టుబడి ఖచ్చితంగా హీరో హీరోయిన్ మధ్య పాట ఉండాలని బలవంతంగా ఇరికించే ప్రయత్నాలు చేయకపోవడం న్యూ జెన్ ఫిలిం మేకర్స్ చూపిస్తున్న మంచి పరిణామం. ఎలాగూ వైబ్ ఉందిలే వీడియో సాంగ్ యూట్యూబ్ లో ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్.

This post was last modified on September 12, 2025 2:03 pm

Share

Recent Posts

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

57 minutes ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

4 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

7 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

7 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

9 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

11 hours ago