Movie News

మిరాయ్ మీద ఆసక్తి బాగుందోయ్

రేపు విడుదల కాబోతున్న మిరాయ్ మీద ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయని బుక్ మై షో ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. సగటున గంటకు 5 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతుండగా కాంపిటీషన్ లో ఉన్న కిష్కిందపురి గంటకు వెయ్యి టికెట్లతో మెల్లగా రేసులో తోడవుతోంది. విచిత్రంగా జపాన్ మూవీ డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ ఊహించని విధంగా మన సినిమాలతో పోటీ పడుతూ గంటకు అయిదు వేలకు పైగా టికెట్లతో వసూళ్లను కవ్విస్తోంది. చాలా నగరాల్లో ఉదయం 5 గంటలకు షోలు వేస్తున్నా హౌస్ ఫుల్స్ కావడం గమనార్హం. డబ్బింగ్ కన్నా ఒరిజినల్ వెర్షన్ వైపే ప్రేక్షకులు మొగ్గు చూపడం ఇంకో ట్విస్ట్.

ఇప్పుడు జరుగుతున్న పాజిటివ్ ట్రెండ్స్ ని తనకు అనుకూలంగా మార్చుకోవడం మిరాయ్ టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మంచి వీకెండ్ దొరికింది. సెకండ్ సాటర్డే సెలవు రోజు కావడంతో వరసగా శని ఆదివారాలు థియేటర్లలో భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేయొచ్చు. ఏపీ తెలంగాణలో చాలా చోట్ల ఉదయం 7 గంటల నుంచే మిరాయ్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. కిష్కిందపురి లాగా ముందు రోజే షోలు వేయకపోయినా రెగ్యులర్ ఆటలు అందులోనూ టికెట్ ధరలు పెంచకుండా పీపుల్స్ మీడియా తీసుకున్న నిర్ణయం మంచి ఫలితం ఇచ్చేలా ఉంది. బుకింగ్ యాప్స్ లో అదే స్పష్టమవుతోంది.

దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని బ్రాండ్ కన్నా కంటెంట్ లో ఉన్న ఫాంటసీ ఎలిమెంట్, విఎఫెక్స్ ఎఫెక్ట్, ట్రైలర్ ఇంపాక్ట్ ఇవన్నీ కలిసి మిరాయ్ మీద హైప్ తీసుకొచ్చాయి. వైబ్ ఉంది పాట బాగా రీచ్ కావడం మరో ప్లస్ గా మారింది. అంతు చిక్కని ప్రపంచంలో సాహసాలు చేసే యువకుడిగా తేజ సజ్జ చేయబోయే అడ్వెంచర్ల కోసం ఈసారి స్కూల్ పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్లకు పరీక్షలు జరుగుతున్నాయి. మిరాయ్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఓజి వచ్చాక కూడా వీలైనన్ని థియేటర్లను హోల్డ్ చేసుకుని తద్వారా చైల్డ్ ఆడియన్స్ ని మూడో వారంలో థియేటర్లకు లాగొచ్చు.  టాక్ రావడమే ఇక బాకీ.

This post was last modified on September 11, 2025 6:10 pm

Share

Recent Posts

మెగావర్స్ కోసం మెగా మల్టీస్టారర్

ఇంకా విడుదల తేడా రాకుండానే, స్ట్రీమింగ్ జరగకుండానే చిరంజీవి టాక్ షో 'మెగా వర్స్' అభిమానుల్లో పెద్ద చర్చకు దారి…

9 minutes ago

ఓదెల పరిధి తగ్గించుకుంటున్నాడా?

‘దసరా’ మూవీతో టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ శిష్యుడైన అతను.. డెబ్యూ…

1 hour ago

కొండా మేడమ్ తో పాటు ఇంకా చాలామంది క్షమాపణ చెప్పాలి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ రెండేళ్ల క్రితం సంచలన ఆరోపణలు…

3 hours ago

జనార్ధన మనసులో రెండు ఆలోచనలు

రణబాలితో డీసెంట్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్థన చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలు పెట్టినప్పుడు…

5 hours ago

కేటీఆర్ చెప్పినట్టే దిగొచ్చిన కొండా సురేఖ

రెండేళ్ల క్రితం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అప్పటి మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు…

8 hours ago

వయొలెన్స్ ఓవర్‌డోస్… కల్ట్ నమ్మకం గట్టిదే

రేపు విడుదల కాబోతున్న కల్ట్ మెల్లగా టైటిల్ కు తగ్గట్టే సౌండ్ పెంచే పనిలో పడింది. ఇంతకు ముందు ట్రైలర్…

8 hours ago