ఘాటీ, మదరాసి లాంటి పెద్ద సినిమాలతో పోటీ పడి ఊహించని స్థాయిలో అనూహ్య విజయం సాధించిన లిటిల్ హార్ట్స్ మొదటి వారం పూర్తి చేసుకుంది. సెకండ్ వీక్ లోకి అడుగు పెట్టకముందే భారీ లాభాలు ఇచ్చిన మూవీ ఈ మధ్య కాలంలో ఇదొక్కటే. ప్రమోషన్ తో కలిపి వరల్డ్ వైడ్ పెట్టుకున్న బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 3 కోట్ల 70 లక్షలు. కాగా ఇప్పటికే 22 కోట్ల గ్రాస్, 11.5 కోట్ల షేర్ వసూలు చేసిన లిటిల్ హార్ట్స్ ఎనిమిది కోట్ల లాభాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. మిరాయ్, కిష్కిందపురి లాంటి కొత్త రిలీజులు ఉండటంతో రేపటి నుంచి ఆక్యుపెన్సీలు, స్క్రీన్లు తగ్గబోతున్న నేపథ్యంలో ఇవాళ థాంక్స్ మీట్ పెట్టారు.
బన్నీ వాస్ చెబుతున్న బిజినెస్ నెంబర్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే జనాలు థియేటర్లకు ఎందుకు వస్తున్నారో ఎందుకు రావడం లేదో అర్థం కాని అమోయమం ఎందరో టాప్ ప్రొడ్యూసర్లలో ఉంది. అలాంటిది లిటిల్ హార్ట్స్ కి టీనేజ్ యువత ఒకటే కాకుండా పెద్దలు, కుటుంబాలు కూడా వస్తుండటం హాళ్లను కళకళలాడేలా చేస్తోంది. హీరో మౌళికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. పలువురు నిర్మాతలు అప్పుడే అడ్వాన్సులతో కుర్రాడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారట. హీరోయిన్ శివాని నగరంతో పాటు ఫ్రెండ్స్ గా నటించినవాళ్లకు కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.
లిటిల్ హార్ట్స్ ఇండస్ట్రీకి ఒక మెసేజ్ ఇచ్చింది. సినిమా అనేది వ్యాపారం లాభం కోసం తీస్తున్నప్పుడు అవి కేవలం విజువల్ గ్రాండియర్లు, స్టార్ హీరోల వల్లే సాధ్యమవుతాయనే భ్రమలో నుంచి ముందు బయటికి రావాలి. కింగ్డమ్, ఘాటీ, హరిహర వీరమల్లు కన్నా లిటిల్ హార్ట్స్ బాగా ఆడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అంటే స్టార్ పవర్ కంటే కంటెంట్ పవర్ గొప్పదని ప్రేక్షకులు మరోసారి ఋజువు చేశారు. అలాని ప్రతి యూత్ మూవీ ఇలాగే ఆడేస్తుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. కంటెంట్ మెప్పించేలా లేకపోతే రెండు కోట్లలో తీసిన సినిమా అయినా వంద కోట్లతో తీసిన ప్యాన్ ఇండియా అయినా రిజల్ట్ మాత్రం మారదు.
This post was last modified on September 11, 2025 1:38 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…