Movie News

దుల్కర్ కాంతకు పోటీగా వెబ్ సిరీస్ ?

దగ్గుబాటి రానా నిర్మాతల్లో ఒకరిగా, దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సినిమా కాంత ఈ నెల 12 విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యంతో పాటు మిరాయ్, కిష్కిందపురి తదితర పోటీ వల్ల వెనుకడుగు వేసి కొత్త డేట్ కోసం ఎదురు చూస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ పీరియాడిక్ డ్రామాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. టీజర్ వచ్చి వారాలు దాటిపోయింది. ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆశ్చర్యపరచబోతున్నారనే అభిప్రాయం ఆడియన్స్ లో కలిగింది. అయితే కాంతని ఎవరి జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్నారో అదే స్టోరీతో ఒక వెబ్ సిరీస్ రూపొందుతోందని ఫిలిం నగర్ టాక్.

కోలీవుడ్ మొదటి సూపర్ స్టార్ గా పేరొందిన వ్యక్తి మయవరం కృష్ణస్వామి త్యాగరాజ భాగవతార్. షార్ట్ కట్ లో ఎంకెటిగా సుప్రసిద్ధులు. 1920లో గాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తక్కువ కాలంలోనే గొప్ప స్టేజి ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. 1934లో సినీ రంగ ప్రవేశం చేశారు. ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో కేవలం 14 సినిమాల్లో నటిస్తే వాటిలో పది బ్లాక్ బస్టర్లు కావడం ఒక చరిత్ర. హరిదాస్ అనే మూవీ చెన్నైలో ఏకధాటిగా మూడేళ్లు ఆడింది. లక్ష్మీకాంతన్ అనే జర్నలిస్టు మర్డర్ కేసులో ఎంకెటి మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి సాక్ష్యాలు బలంగా లేక బయటికొచ్చారు. 1959లో అనారోగ్యంతో చనిపోయారు.

ఇక్కడ సింపుల్ గా చెప్పుకున్నాం కానీ ఎంకెటి జీవితంలో సినిమాకు ఏ మాత్రం తీసిపోని డ్రామా, మలుపులు ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన లెజెండరీగా రాజ్యమేలిన ఒక సూపర్ స్టార్ అంత పతనం ఎలా చూశారనే దాని మీద బోలెడంత రీసెర్చ్ వర్క్ ఉంది. దీని ఆధారంగానే కాంత తీశారనే ప్రచారం చెన్నై వర్గాల్లో బలంగా ఉంది. ఇదే బ్యాక్ డ్రాప్ తో ది మద్రాస్ మిస్టరీ అనే వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. అంటే సుందరానికి ఫేమ్ నజ్రియా ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషించింది. మరి నిజంగా రెండు కథలు ఒకటా లేక వెనుకాల ఇంకేదైనా ట్విస్టు ఉందా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే ఆగితే క్లారిటీ రావొచ్చు.

This post was last modified on September 11, 2025 11:49 am

Share
Show comments
Published by
Kumar
Tags: Kaantha

Recent Posts

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

2 hours ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

2 hours ago

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

3 hours ago

మెస్సీ పక్కన సీఎం భార్య.. ఇదేం ఆటిట్యూడ్ బాబోయ్

మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

3 hours ago

వెయ్యి కోట్ల టార్గెట్ అంత ఈజీ కాదు

దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…

4 hours ago

పద్మభూషణ్ ను కూడా మోసం చేసేశారు…

డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…

4 hours ago