Movie News

మళ్లీ హీరోగా సునీల్ సినిమా

ఒక సమయంలో బ్రహ్మానందంను కూడా వెనక్కి నెట్టి టాలీవుడ్లో నంబర్ వన్ కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగాడు సునీల్. కానీ ‘అందాల రాముడు’తో అనుకోకుండా హీరోగా మారి హిట్టు కొట్టిన అతను.. ఆ తర్వాత పూల రంగడు, మర్యాద రామన్న చిత్రాలతోనూ విజయాలు అందుకోవడంతో కామెడీ వేషాలు వదిలేసి సీరియస్‌గా హీరో వేషాల మీదే ఫోకస్ పెట్టాడు. కానీ ఈ ఆలోచనే ఒక దశలో తన కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసింది. 

హీరోగా వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొని రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది తన పరిస్థితి. దీంతో ఒక దశ దాటాక హీరో వేషాలు వదిలేసి మళ్లీ కామెడీ ట్రై చేశాడు. అవి వర్కవుట్ కాకపోతే క్యారెక్టర్, విలన్ వేషాల వైపు మళ్లాడు. అవి కొంతమేర క్లిక్ అయి ఇప్పుడు తన కెరీర్ బాగానే నడుస్తోంది. ఐతే సునీల్‌ను ఇక మళ్లీ హీరో వేషాల్లో చూడలేమనే అంతా అనుకుంటున్న సమయంలో అతను లీడ్ రోల్‌లో ఒక సినిమా చేస్తున్న విషయాన్ని నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ వెల్లడించారు.

తమ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రాల గురించి వివరిస్తూ.. సునీల్‌తో ‘మర్యాద కృష్ణయ్య’ అనే సినిమా గురించి ప్రస్తావించారు విశ్వప్రసాద్. ఈ ఏడాదే ఆ సినిమా రిలీజవుతుందని కడూ ఆయన ప్రకటించారు. ఐతే ఇదేమీ కొత్త చిత్రం కాదు. నాలుగేళ్ల కిందట ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘మర్యాద రామన్న’లో సునీల్‌కు జోడీగా నటించిన సలోనినే ఇందులో కూడా హీరోయిన్. ‘మనసంతా నువ్వే’ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ ఏవో కారణాలతో విడుదల కాలేదు. 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చిన్న బేనర్‌గా ఉన్నపుడు వేరే నిర్మాతలతో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు విశ్వప్రసాద్. కానీ ఇప్పుడా సంస్థ టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్స్‌లో ఒకటిగా ఎదిగింది. రెండంకెల సంఖ్యలో సినిమాలు నిర్మిస్తోంది. ఇలాంటి టైంలో సునీల్ సినిమాను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి దాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు విశ్వప్రసాద్. కానీ హీరోగా సునీల్‌ను అందరూ మరిచిపోయిన సమయంలో, అస్సలు ఫామ్‌లో లేని వి.ఎన్.ఆదిత్య రూపొందించిన సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకర్షిస్తుందన్నది ప్రశ్న.

This post was last modified on September 10, 2025 4:07 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Sunil

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago