Movie News

తేజ సజ్జ చెప్పిన ఇండియన్ ఎవంజర్స్ ఐడియా

సినిమాటిక్ యూనివర్శ్.. మల్టీవర్స్.. ఇండియన్ సినిమాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ట్రెండ్. ‘విక్రమ్’ సినిమాలోని క్యారెక్టర్లకు ‘ఖైదీ’ చిత్రంలోని పాత్రలతో కనెక్షన్ పెట్టి లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ పేరుతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు లోకేష్ కనకరాజ్. అంతకంటే ముందు బాలీవుడ్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు.. తమ స్పై సినిమల్లో ఇలాంటి కనెక్షన్లతో ప్రేక్షకులను అలరించారు. ఐతే హాలీవుడ్లో ఎప్పట్నుంచో ఈ ట్రెండ్ చూస్తున్నాం. 

పాపులర్ సూపర్ హీరో పాత్రలన్నింటినీ ఒక చోటికి చేర్చి ‘ఎవెంజర్స్’ పేరుతో ఫ్రాంఛైజీ సినిమాలు తీయడం ద్వారా ఎప్పటికప్పుడు కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతూ వచ్చింది హాలీవుడ్. కొన్నేళ్ల కిందట ‘ఎండ్ గేమ్’ పేరుతో సినిమా తీసి ఈ ఫ్రాంఛైజీకి తెరదించేశారు మేకర్స్. ఐతే అక్కడ ముగిసిన ట్రెండును ఇండియాలో కొనసాగిస్తే బాగుంటుందని అంటున్నాడు యువ కథానాయకుడు తేజ సజ్జ.

తన కొత్త చిత్రం ‘మిరాయ్’ ప్రమోషన్లలో భాగంగా కేరళకు వెళ్లిన తేజ.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ‘ఎవెంజర్స్’ గురించి హింట్ ఇచ్చాడు. తేజ ఇప్పటికే ‘హనుమాన్’లో ఒక సూపర్ హీరో క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు ‘మిరాయ్’లో సూపర్ యోధగా అలాంటి పాత్రే ఇంకొకటి చేశాడు. ఇటీవలే మలయాళం నుంచి మరో సూపర్ హీరో మూవీ ‘లోకా’ వచ్చింది. అందులో తొలిసారి ఒక హీరోయిన్ని సూపర్ హీరోగా చూశాం. మలయాళం నుంచే ‘మిన్నల్ మురళి’ రూపంలో మరో సూపర్ హీరో సినిమా ఉంది. 

ఈ పాత్రలన్నింటినీ కలిపి భవిష్యత్తులో ‘ఎవెంజర్స్’ తరహా మల్టీవర్స్ తీస్తే బాగుంటుందని తేజ అన్నాడు. ఈ ఆలోచన నిజం అయినా ఆశ్చర్యం లేదని.. ఎవరైనా అలాంటి సినిమా తీస్తే నటించడానికి తాను రెడీ అని అతనన్నాడు. మరి తేజ చెప్పిన క్రేజీ ఐడియాను ఎవరైనా సీరియస్‌గా తీసుకుని ఇండియన్ ఎవెంజర్స్‌ను తెరపైకి తీసుకొస్తారేమో చూడాలి.

This post was last modified on September 10, 2025 1:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

20 minutes ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

26 minutes ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

52 minutes ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

2 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago

కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…

3 hours ago