లిటిల్ హార్ట్స్.. లిటిల్ హార్ట్స్.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. కొత్త హీరో హీరోయిన్లను పెట్టి ఒక డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతోంది. పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన ఈ చిత్రం.. పెయిడ్ ప్రిమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పోటీగా వచ్చిన రెండు పెద్ద సినిమాలు నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం దీనికి బాగా కలిసొచ్చింది.
తొలి రోజు సాయంత్రం నుంచే హౌస్ ఫుల్ వసూళ్లతో సాగుతోందీ చిత్రం. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు వసూళ్లు ఎక్కువగా వచ్చాయి. వీకెండ్లో రూ.12 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం రేపిందీ సినిమా. కేవలం రెండున్నర కోట్లకు థియేట్రికల్ హక్కులను అమ్మితే.. వీకెండ్లోనే 12 కోట్ల గ్రాస్ అంటే ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఐతే వీకెండ్ వరకు అయితే సత్తా చాటింది కానీ.. వీక్ డేస్‌లో సినిమా నిలబడగలదా అని సందేహించిన వారికి కూడా ఈ చిత్రం సమాధానం చెప్పింది. పెద్ద సినిమాలు కూడా వీకెండ్ తర్వాత స్లో అయిపోతుంటాయి. ఐతే ‘లిటిల్ హార్ట్స్’ మాత్రం సోమవారం కూడా బలంగా నిలబడింది. నాలుగో రోజు ఈ సినిమాకు రూ.3 కోట్ల మేర వసూళ్లు వచ్చినట్లు అంచనా. ఈవెనింగ్ షోలకు ఫుల్స్ పడ్డాయి. వీక్ డే అయిన నాలుగో రోజు.. తొలి రోజును మించి వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది ‘లిటిల్ హార్ట్స్’.
సినిమాలకు మహ రాజ పోషకులైన యూత్ కనెక్ట్ అయితే ఆ సినిమాకు తిరుగుండదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది, పైగా ఎంటర్టైనర్.. అందులోనూ మల్టీప్లెక్సుల్లో 150-200తో టికెట్ల ధరలు అందుబాటులో ఉన్నాయి. మరి యువ ప్రేక్షకులు సినిమాను ఎగబడి చూడకుండా ఎలా ఉంటారు? అందుకే సినిమాకు వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ఫుల్ రన్లో 20-25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి చిన్న సినిమాల్లో పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలవబోతోంది ‘లిటిల్ హార్ట్స్’.
This post was last modified on September 9, 2025 5:26 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…