మొత్తానికి చాన్నాళ్లుగా చర్చల్లో ఉన్న సినిమా కార్యరూపం దాల్చింది. 13 ఏళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘ఢీ’కి సీక్వెల్ రాబోతోంది. మంచు విష్ణు, శ్రీను వైట్ల కలిసి చేయబోతున్న ఈ చిత్రానికి ‘డి అండ్ డి’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఐతే ‘ఢీ’కి సీక్వెల్ అనగానే అందరూ ఆశించేది ఎంటర్టైన్మెంట్. అప్పట్లో ‘ఢీ’ జనాల్ని మామూలుగా నవ్వించలేదు.
సినిమాలో వేరే ఆకర్షణలు కూడా ఉన్నప్పటికీ హైలైట్ అయింది మాత్రం కామెడీనే. ఐతే ఆ సినిమాలో ప్రేక్షకులను నవ్వించే బాధ్యత తీసుకున్న వాళ్లు ఎవ్వరూ ఇప్పుడు ఎంటర్టైన్ చేసే స్థితిలో లేరు. ‘ఢీ’లో చాలా ప్రత్యేకంగా అనిపించింది, కడుపుబ్బ నవ్వించింది బ్రహ్మానంం చేసిన చారి పాత్రే. అత్యంత భయస్థుడిగా కనిపిస్తూ బ్రహ్మి ఎంతగా నవ్వించాడో.. చివర్లో మందు కొట్టి చెలరేగిపోయే సీన్లో అదే స్థాయిలో కామెడీ పండించాడు.
ఐతే బ్రహ్మి ఇలా నవ్వించి చాలా ఏళ్లయిపోయింది. ఇప్పుడాయన సినిమాల్లో కనిపిస్తేనే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఆయన పాత్రలు వరుసగా తేలిపోతుండటంతో ఆయన ఫేవరెట్ డైరెక్టర్లు సహా అందరూ పక్కన పెట్టేశారు. ఇప్పుడు బ్రహ్మిని కన్సిడర్ చేసే పరిస్థితే లేదు. ఇక బ్రహ్మితో ‘ఢీ’లో భలేగా కెమిస్ట్రీ పండించిన సునీల్ ఇప్పుడసలు కమెడియన్‌గా అసలు సెట్టవట్లేదు. మధ్యలో హీరో వేషాలేసి ఇమేజ్ దెబ్బ తీసుకున్నాడు. ఇప్పుడతను కామెడీ చేస్తే ఎవరూ చూడట్లేదు కాబట్టి అతణ్ని కూడా ‘ఢీ’ సీక్వెల్‌కు తీసుకునే పరిస్థితి లేదు.
ఇక ‘ఢీ’లో తమదైన శైలిలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను వినోదపరిచిన శ్రీహరి, జయప్రకాష్ రెడ్డి మధ్యలో కాలం చేశారు. వాళ్లను రీప్లేస్ చేయడం అంత సులువైన విషయం కాదు. కాబట్టి ‘ఢీ’తో పోలిక రాకుండా భిన్నమైన పాత్రలు, కామెడీ సన్నివేశాలతో నవ్వించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది శ్రీను వైట్ల టీం. ప్రస్తుతం టాప్ కమెడియన్‌గా కొనసాగుతున్న వెన్నెల కిషోర్‌ను రంగంలోకి దించితే కొంచెం ప్రయోజనం ఉండొచ్చు.
This post was last modified on November 24, 2020 2:46 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…