ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తున్న నేపథ్యంలో గత కొన్నేళ్ల నుంచి రీమేక్స్ అన్నవి కత్తి మీద సాములా తయారయ్యాయి. ఒక సినిమా రీమేక్ అని తెలియగానే.. దాని విశేషాలన్నీ బయటికొచ్చేస్తున్నాయి. జనం ఒరిజినల్ చూసేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో డిస్కషన్లు పెట్టేస్తున్నారు. దీంతో కథ పరంగా ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు. చాలా వరకు రీమేక్‌లకు రిజల్ట్ తేడా కొట్టేస్తున్నాయి. ఐతే కొందరు దర్శకులు మాతృకను ఉన్నదున్నట్లు తీయకుండా.. మార్పులు చేర్పులతో కొత్త లుక్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంత బాగా తీసినా సరే.. రీమేక్ అనగానే దాని చుట్టూ ఒక రకమైన నెగెటివిటీ ముసురుకుంటోంది.
చివరగా టాలీవుడ్లో రీమేక్‌తో దెబ్బ తిన్న హీరో.. బెల్లంకొండ శ్రీనివాస్. తమిళ హిట్ ‘గరుడన్’ను ఇంకా భారీగా, కొన్ని మార్పులు చేర్పులు చేసి, మంచి కాస్టింగ్‌ను పెట్టుకుని ‘భైరవం’ తీశారు. కానీ ఆ సినిమా ఆడలేదు. తాము ఎంత కష్టపడి చేసినప్పటికీ.. రీమేక్ కావడం వల్లే ఈ సినిమా ఆడలేదని బెల్లంకొండ శ్రీనివాస్ తేల్చేశాడు. రీమేక్ చేయడమే తప్పు అని తమకు లేటుగా అర్థమైందని అతను తెలిపాడు.
‘గరుడన్’ అంత పాపులర్ కాని సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా చూసి ఉండరన్న ఉద్దేశంతోనే ఈ సినిమా చేశామని.. రిలీజ్ ముందు వరకు రిజట్ల్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని శ్రీనివాస్ తెలిపాడు. కానీ జనం మాత్రం రీమేకే కదా అని తేలిగ్గా తీసి పడేశారని.. సినిమా పట్ల ఇంట్రెస్ట్ చూపించలేదని శ్రీనివాస్ తెలిపాడు. ఈ విషయంలో ప్రేక్షకులను తప్పుబట్టలేనని.. స్వయంగా తాను కూడా వేరే హీరో సినిమా రీమేక్ అంటే.. చూడడానికి ఆసక్తి ప్రదర్శించనని అతనన్నాడు. కేవలం ‘గరుడన్’ సినిమాను ఎక్కువమంది చూసి ఉండరన్న ఉద్దేశంతోనే దాన్ని మరింత భారీగా చేద్దామని ట్రై చేశామని.. తన కెరీర్లో తొలిసారిగా చేసిన రూరల్ డ్రామా కావడంతో అది తనకు చాలా స్పెషల్ అని శ్రీనివాస్ తెలిపాడు.
This post was last modified on September 9, 2025 6:38 am
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…