శర్వానంద్ కొత్త సినిమా నారి నడుమ మురారి షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా విడుదల ప్రకటన రాలేదు. ఓటిటి డీల్స్ వల్ల అనౌన్స్ మెంట్ లేట్ అయ్యిందనే ప్రచారం జరిగింది కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు తీసిన మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. తీరా చూస్తే ఈ ఏడాదిలో రిలీజ్ స్లాట్లు లేవు. సెప్టెంబర్ మినహాయిస్తే అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా మొత్తం ప్యాక్ అయిపోయింది. అందుకే 2026 సంక్రాంతికి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. కాకపోతే ఇక్కడ చాలా రిస్కులు ముడిపడి ఉన్నాయి.
నారి నారి నడుమ మురారిలో బోలెడు ఫన్ ఉండొచ్చు. కానీ పండగ కాంపిటీషన్ లో ఉన్న మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజుని ఏ మాత్రం తక్కువంచనా వేయడానికి లేదు. చిరంజీవి, నవీన్ పోలిశెట్టిలతో పోలిస్తే కామెడీ టైమింగ్ లో శర్వానంద్ పోటీ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఏదీ చూడాలనే కన్ఫ్యూజన్ కు లోనైతే ప్రాధాన్యతలు మారిపోతాయి. వీటికి తోడు కిషోర్ తిరుమల తీస్తున్న రవితేజ 77 కూడా వినోదాత్మకంగానే ఉంటుందట. అదే నిజమైతే పరిస్థితి ఇంకా జటిలంగా ఉంటుంది. అసలే ది రాజా సాబ్ ని ఎలా ఎదురుకోవాలోనని ఇతర సినిమాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
వీటికి తోడు తమిళ డబ్బింగులు విజయ్ జన నాయకుడు, శివ కార్తికేయన్ పరాశక్తిలు పండగ బరిలోనే ఉండాలని కంకణం కట్టుకున్నాయి. అలాంటప్పుడు ఇన్నేసి వాటికి థియేటర్ల సర్దుబాటు చేయడం డిస్ట్రిబ్యూటర్లకు నరకమే. హైదరాబాద్ లాంటి చోట్ల పెద్ద సమస్య కాదు కానీ బిసి సెంటర్లలో అన్నింటిని అకామడేట్ చేయడం అసాధ్యం. మరి నారి నారి నడుమ మురారికి సంబంధించి తిరుగుతున్న వార్త కేవలం పుకారా లేక నిజంగానే సంక్రాంతి వైపు చూస్తున్నారా అనేది వేచి చూడాలి. ఫాన్స్ మాత్రం అంత రిస్క్ ఎందుకు హ్యాపీగా ఒంటరిగా వస్తే ప్రశాంతంగా హిట్టు కొట్టొచ్చు కదా అంటున్నారు.
This post was last modified on September 8, 2025 4:57 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…