నాని తదుపరి చిత్రం టక్ జగదీష్ మార్చి లేదా ఏప్రిల్‍లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి అప్‍డేట్స్ ఏమీ అఫీషియల్‍గా రావడం లేదు. దీని తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం చేయాలని నాని ఫిక్సయ్యాడు. బడ్జెట్ ఎక్కువ అవుతుందని నిర్మాత తప్పుకున్నా కానీ మరో నిర్మాతను తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ అప్పగించాడు. అదెప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈలోగా ‘అంటే సుందరానికీ’ అనే సినిమా అనౌన్స్ చేసి హంగామా చేసాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే ఈ కామెడీ సినిమా మొదలయ్యేది ఇప్పుడు కాదు.
మరి ఎప్పుడో మొదలయ్యే సినిమాకు నాని ఇంత ముందుగా ఎందుకు హడావిడి చేసాడనేది అంతు చిక్కడం లేదు. ఇదిలావుంటే శ్యామ్ సింగరాయ్ బడ్జెట్ దృష్టిలో వుంచుకుని ఆ చిత్రాన్ని కాస్త వెనక్కు జరిపి, ముందుగా అంటే సుందరానికీ చేసేయాలని నాని భావిస్తున్నాడనే గుసగుసలు మొదలయ్యాయి. కానీ అదే జరిగితే సదరు సినిమాపై మరిన్ని అనుమానాలు మొదలవుతాయి. ఆల్రెడీ అంత పెద్ద నిర్మాతలు హీరోతో సంబంధాల గురించి వెరవకుండా వెనక్కు వెళ్లారనేదే రూమర్స్ కి తావిచ్చింది. ఇప్పుడు ఆ సినిమాను వాయిదా వేస్తే మరింత డ్యామేజ్ అవుతుంది కనుక నాని అలాంటి రిస్క్ తీసుకోకపోవచ్చు.
This post was last modified on November 24, 2020 2:07 am
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…