ఈ వీకెండ్లో లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా రిలీజవుతుంటే.. ఘాటి లాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ముందు ఇది ఏమాత్రం నిలుస్తుందో అనుకున్నారు చాలామంది. అందులో హీరోగా నటించింది మీమ్స్ ద్వారా ఫేమస్ అయిన మౌళి. అతణ్ని మామూలుగా చూస్తే హీరో ఫీచర్స్ ఏమీ కనిపించవు. హీరోయిన్ శివాని నగరంది ఒక సినిమా అనుభవం. దర్శకుడు సైతం మీమ్స్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వాడే.
ఇలాంటి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం.. అనుష్క, క్రిష్ కలయికలో తెరకెక్కిన ఘాటితో పాటు మురుగదాస్, శివ కార్తికేయన్ కాంబినేషన్లో రూపొందిన మదరాసిని కూడా వెనక్కి నెట్టేసింది. రెండో రోజు బుక్ మై షోలో లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమా ఎంత స్ట్రాంగ్‌గా కొనసాగుతోందో అర్థం చేసుకోవచ్చు. రిలీజ్‌కు ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ పడ్డాయి ఈ చిత్రానికి. దాన్నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజు అది మరింత స్ప్రెడ్ అయింది.
తొలి రోజు కోటిన్నర దాకా గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాకు.. రెండో రోజు వసూళ్లు ఇంకా పెరగడం విశేషం. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.2.5 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఆ మొత్తం షేర్ రూపంలో రెండు రోజులకే వచ్చేయడం విశేషం. ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ అయిన సినిమా ఈ మధ్య కాలంలో ఇదే కావచ్చు. ఈ చిన్న సినిమాను నమ్మి డిస్ట్రిబ్యూట్ చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటిల పంట పండినట్లే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక యుఎస్‌లోనూ ఈ సినిమా అదరగొడుతోంది.
శని, ఆదివారాల్లో ఈ సినిమాకు ఏపీ, తెలంగాణల్లోని మేజర్ సిటీస్‌లో మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు అని తేడా లేకుండా హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. హైదరాబాద్‌లో అయితే చాలా చోట్ల టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. రెండో రోజు నుంచి లిటిల్ హార్ట్స్‌కు స్క్రీన్లు, షోలు అంతకంతకూ పెరుగుతున్నాయి. లిటిల్ హార్ట్స్‌లో గొప్ప కథేమీ ఉండదు. అదేమీ క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకున్న సినిమా కూడా కాదు. కానీ సింపుల్ స్టోరీతోనే యూత్‌కు నచ్చే కామెడీతో నాన్ స్టాప్‌గా నవ్వించడంతో సినిమా చూసిన వాళ్లంతా హ్యాపీగా బయటికి వస్తున్నారు. పైసా వసూల్ సినిమా అనే టాక్ స్ప్రెడ్ అయి యూత్ ఎగబడి ఈ సినిమా చూస్తున్నారు.
This post was last modified on September 7, 2025 8:55 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…