తేజ సజ్జ.. హనుమాన్ సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించిన యువ కథానాయకుడు. తన కొత్త చిత్రం మిరాయ్ భారీ అంచనాల మధ్య రిలీజవుతోంది. మిడ్ రేంజ్ స్టార్లకు పోటీ ఇచ్చే స్థాయికి వచ్చేశాడతను. ఈ సినిమా కూడా హనుమాన్ లాగా పెద్ద హిట్టయితే అతడి లెవెలే మారిపోతుంది. ఐతే తేజకు టాలీవుడ్లో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకపోవచ్చు కానీ.. బాల నటుడిగా అతడికున్న గుర్తింపే పెద్ద బ్యాగ్రౌండ్. చూడాలని ఉంది, ఇంద్ర సహా బాల నటుడిగా 50 దాకా సినిమాలు చేశాడతను.
ఓ బేబీ చిత్రంతో అతను రీఎంట్రీ ఇచ్చాడు. అందులో అతను హీరో కాదు. తనది క్యారెక్టర్ రోల్. తర్వాత జాంబి రెడ్డితో హీరో అయ్యాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. హనుమాన్ తన కెరీర్‌ను మార్చేసింది. బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించడంతో చిరంజీవి సహా పెద్ద పెద్ద స్టార్లతో అతడికి మంచి పరిచయం ఉంది. అందరిలోకి చిరుతోనే అతడికి మంచి అనుబంధం ఉంది. చిరు తనను ఒక కొడుకులా చూస్తాడని గతంలోనే చెప్పాడు తేజ. చిరునే కాక ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం తన పట్ల ఎంత ప్రేమగా ఉంటాడో ఒక ఇంటర్వ్యూలో తేజ వెల్లడించాడు.
తాను, చరణ్ బయట ఇప్పటిదాకా ఎన్నడూ కలిసి కనిపించలేదు కానీ.. తమ మధ్య గొప్ప బాండింగ్ ఉందని తేజ తెలిపాడు. తనతో చరణ్ చాలా ప్రేమగా మాట్లాడతాడని అతనన్నాడు. చరణ్ తనకు ఎంత క్లోజో అతను ఒక ఉదాహరణ చెప్పాడు. హనుమాన్ సినిమా తర్వాత తాను ఒక షూటింగ్‌లో భాగంగా ఒక చోట ఉన్నానని.. ఆ రోజు రాత్రి పడుకుని ఉంటే అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో తనకు ఒక కాల్ వచ్చిందని.. ఒక వ్యక్తి మీదో ఒకరు మాట్లాడతారంటూ ఫోన్ ఇచ్చాడని.. చరణే ఆ ప్రాంక్ కాల్ చేశాడని తేజ వెల్లడించాడు.
బాల నటుడిగా మొదలుపెట్టి.. ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమా చేసి మంచి గుర్తింపు సంపాదించడం గురించి చరణ్ ప్రస్తావిస్తూ.. తన సక్సెస్ విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేశాడని.. అది తనకు గొప్ప ఫీలింగ్ ఇచ్చిందని తేజ తెలిపాడు. చరణ్ బయట పెద్దగా కనిపించే వ్యక్తి కాదని.. తన పనిలో తాను ఉన్నానని.. కాబట్టి ఇద్దరం ఇప్పటిదాకా ఎక్కడా కలిసి మీడియాకు కనిపించలేదు కానీ.. తనతో చరణ్ చాలా క్లోజ్‌గా ఉంటాడంటూ ఈ ఉదాహరణ చెప్పాడు తేజ. ఇక హీరో కావాలనుకున్నపుడు చిరంజీవిని వెళ్లి కలిస్తే.. ఇప్పుడున్న హీరోలు చేస్తున్నది కాకుండా నువ్వు డిఫరెంట్‌గా ఏం చేయగలవో ఆలోచించుకుని అది చెయ్యమని చిరు సలహా ఇచ్చారని.. ఆ మాటనే ఫాలో అవుతున్నానని తేజ చెప్పాడు.
This post was last modified on September 7, 2025 8:52 pm
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…